సీఎం జగన్‌ను కలిసిన ఏపీ ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు, పదోన్నతి కల్పించినందుకు కృతజ్ఞతలు

AP Association of MPDOs Thanks CM Jagan Regarding Promotions and Transfers Opportunities, Association of MPDOs Thanks CM Jagan, Promotions and Transfers Opportunities Of MPDOs, AP MPDOs Association, Promotions and Transfers, AP CM YS Jagan, AP MPDOs Association News, AP MPDOs Association Latest News And Updates, AP MPDOs Association Live Updates, Mango News, Mango News Telugu,

రెండు దశాబ్దాలకు పైగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డినికి ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమకు పదోన్నతులు కల్పించినందుకు సీఎం జగన్‌ను వారందరూ కలిసి సన్మానించారు.

అయితే ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రికి ఒక విన్నపం చేశారు. గతంలో టీచర్లు ఒకేచోట 8 ఏళ్ళు పనిచేశాకే బదిలీ చేసేవారని, కానీ ఇప్పుడు దానిని 5 సంవత్సరాలకు తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోందని సీఎం జగన్‌కు తెలిపారు. అలా వద్దని, గత విధానాన్నే కొనసాగించాలని కోరారు. ఆయన సూచనపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఇక ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో వెంకట్రామిరెడ్డితో పాటు ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి నారాయణ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస రెడ్డి, కన్వీనర్‌ కేఎన్‌వీ.ప్రసాదరావు, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + three =