పేద, మద్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తలసాని

Ministers Talasani Srinivas Yadav Mahmood Ali Laid Foundation Stone to 2BHK Houses in Cantonment Area, Minister Mahmood Ali Laid Foundation Stone to 2BHK Houses in Cantonment Area, Minister Talasani Srinivas Yadav Laid Foundation Stone to 2BHK Houses in Cantonment Area, Foundation Stone to 2BHK Houses in Cantonment Area, Minister Talasani Srinivas Yadav, Minister Mahmood Ali, Animal Husbandry Minister Talasani Srinivas Yadav Laid Foundation Stone to 2BHK Houses in Cantonment Area, Home Minister Mahmood Ali Laid Foundation Stone to 2BHK Houses in Cantonment Area, 2BHK Houses in Cantonment Area, Animal Husbandry Minister Talasani Srinivas Yadav, Home Minister Mahmood Ali, Talasani Srinivas Yadav, Mahmood Ali, 2BHK Houses, Mango News, Mango News Telugu,

పేద, మద్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో నారాయణ జోపిడి సంఘంలో 22.94 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 296 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్, హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, పేద ప్రజలు అన్ని సౌకర్యాలు కలిగిన సొంత ఇంటిలో సంతోషంగా ఉండాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే పలు చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి లబ్దిదారులకు అందించడం జరిగిందని, లబ్దిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. మురికి కూపాలను తలపించే బస్తీలు నేడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంతో కొత్తదనాన్ని సంతరించుకున్నాయని వివరించారు.

ఇండ్లు ఇప్పిస్తామని కొంతమంది దళారులు మీ వద్దకు వస్తారని, వారిని నమ్మి మోసపోవద్దని, అర్హులైన వారు అందరికి పారదర్శకంగా వ్యవహరించి ఇండ్లను కేటాయించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద పేదింటి ఆడపడుచు వివాహానికి లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేష్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి, డీఈ గంగాధర్, ఎంఆర్ఓ బాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − twelve =