నానిని కలవరపెడుతున్న పాత రికార్డు!

Is Perni Kittu Winning Possible?, Perni Kittu Winning, Winning Possible Perni Kittu, Perni Kittu, Perni Nani, AP Elections, YCP, Machilipatnam Politics, Assembly Elections, CM Jagan, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
perni kittu, perni nani, ap elections, ycp, Machilipatnam Politics, assembly elections, cm jagan

ఏపీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మచిలీపట్నం రాజకీయాలు రంజుగా మారాయి. కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండే సాగర నగరంలో ఈసారి కాపు వర్సెస్ బీసీ ఫైట్‌ ఆసక్తిని రేపుతోంది. మచిలీపట్నం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి పేర్ని కిట్టు బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడే కిట్టు. పూర్తి పేరు సాయి కృష్ణమూర్తి. అతని వయసు 27ఏళ్లు. ఇంజినీరింగ్‌ చదివిన కిట్టు తొలిసారి ఎన్నికల్లో పోటి పడనున్నారు. మరోవైపు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి బందర్‌లో టఫ్‌ ఫైట్‌ ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో పేర్ని నానిని పాత రికార్డు ఒకటి వేధిస్తోంది. ఇంతకీ ఏంటా రికార్డు? తన కొడుకును నాని గెలిపించుకోగలడా?

ఒకసారి ఫ్లాష్‌ బ్యాక్‌కు వెళ్దాం. అది 2014.  2004, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన నాని 2014లో జగన్‌ పార్టీ నుంచి పోటికి దిగారు. కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండే మచిలీపట్నంలో క్యాస్ట్‌ ఫ్యాక్టర్‌ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటు టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కొల్లు రవీంద్రని గ్రౌండ్‌లోకి దింపాయి. కొల్లు రవీంద్ర బీసీ నేత. దీంతో నాని గెలుపు ఖాయమే అనుకున్నారంతా. అయితే పవన్‌ రూపంలో నానికి గట్టి దెబ్బపడింది. 2014లో జనసేన పోటి చేయనప్పటికీ బీజేపీ-టీడీపీ కూటమికి పవన్‌ మద్దతిచ్చారు. చంద్రబాబు-మోదీ తరుఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మిగిలిన నయోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా పవన్‌ ఫ్యాన్స్‌ ఎక్కువగా ఉండే మచిలీపట్నంలో కాపు సామాజీకవర్గం టీడీపీకి పట్టం కట్టింది. ఇది నాని పొలిటికల్‌ కెరీర్‌లో అదిపెద్ద దెబ్బ.

మరోసారి 2014 తరహాలోనే ఈ సారి కూడా బీజేపీ-టీడీపీ-జనసేన కలిశాయి. వైసీపీ అభ్యర్థిగా నాని నిలబడలేదు కానీ ఆయన కొడుకును నిలబెట్టారు. ఈ విషయంలో జగన్‌తో పరోక్ష యుద్ధమే చేశారు నాని. తన కొడుకుకు అతి కష్టంమీద టికెట్ ఇప్పించుకున్నారు. ఇక మూడేళ్లుగా మచిలీపట్నం నియోజకవర్గంలో నాని కంటే కొడుకు కిట్టునే యాక్టివ్‌గా ఉన్నారు. ఎక్కడ చూసినా కిట్టు బ్యానర్లే దర్శనమిచ్చేవి. ప్రజల్లో కలుపుగోలుగా తిరిగే నేతగా నానికి మంచి పేరే ఉంది. అందుకే కిట్టుతో కూడా అదే స్ట్రాటజీతో ప్రజల మధ్య తిరిగేలా చేశారు నాని. అటు పోర్టు విషయంలోనూ నాని దూకుడు కనబరిచారు. ఇప్పటికే పోర్టు మొదటి దశ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే 2014 రికార్డు మాత్రం నానిని కలవరపెడుతూనే ఉంది. పవన్‌కు మచిలీపట్నంలో గతంలో కంటే ఇమేజ్ పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. వారంతా ఈసారి కూడా కొల్లు రవీంద్రకే ఓటు వేస్తే వైసీపీకి పడే ఓట్లు చీలిపోవడం ఖాయం. 2019లో సింగిల్‌గా పోటి చేసిన జనసేన టీడీపీ ఓట్లను చీల్చడం వల్లే నాని గెలిచారని ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు బందర్‌ రచ్చబండ్లపై మాట్లాడుకుంటారు. ఈసారి ఆ ఛాన్స్ లేకపోవడంతో నాని టెన్షన్‌ పడుతున్నారని తెలుస్తోంది. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేయాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =