అనుమతి లేకుండా ర్యాలీ.. చంద్రబాబుపై కేసు నమోదు

Rally Without Permission Case Registered Against Chandrababu,Rally Without Permission Case,Registered Against Chandrababu,Mango News,Mango News Telugu,TD cadres booked for Chandrababu Naidu,TDP cadre booked for organising rally,Police Case On CBN,Case Filed On CBN In Hyd,chandrababu naidu, case file on chandrababu, tdp, begumpet police,Chandrababu Naidu Latest News,Chandrababu Naidu Latest Updates,Chandrababu Rally Latest News,Chandrababu Rally Latest Updates
chandrababu naidu, case file on chandrababu, tdp, begumpet police

వరుస కేసులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓ కేసు పోతే.. మరో కేసు వరుసగా ఆయన్ను వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు ఆయన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో జైలు జీవితం గడిపారు. 52 రోజుల పాటు జైలులోనే ఉన్నారు. ఇటీవలే అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ లభించడంతో బయటకొచ్చారు. తిరిగి ఆయన ఈనెల 28న సాయంత్రం 5 గంటల లోగా రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాల్సి ఉంది.

అయితే చంద్రబాబు బయటకొచ్చినప్పటికీ ఆయన్ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఫైబర్ నెట్, ఏపీ లిక్కర్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ అంగళ్లు కేసులు ఇప్పటి వరకు చంద్రబాబుపై నమోదయయ్యాయి. అయితే అవన్నీ ఏపీలోనే చంద్రబాబుపై నమోదు కాగా.. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయనపై కేసు ఫైల్ అయింది.

హైదరాబాద్‌లోని బేగంపేట్ పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదు. ఒకవేళ ర్యాలీ, సభ నిర్వహించాలన్నా.. రిటర్నింగ్ అధికారి నుంచి 48 గంటల ముందే అనుమతి తీసుకోవాలి. అయితే బుధవారం రాత్రి హైదరాబాద్‌ వచ్చిన చంద్రబాబు ఎటువంటి అనుమతి లేకుండానే.. ర్యాలీ నిర్వహించారు.

బుధవారం రాత్రి చంద్రబాబు హైదరాబాద్‌కు రావడంతో.. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు చంద్రబాబు నాయుడు ర్యాలీ నిర్వహించారు. దాదాపు 400 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

అయితే అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో.. చంద్రబాబుపై బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఓ ఏస్‌ఐ చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బేగంపేట్ పోలీసులు చంద్రబాబు, టీడీపీ జనరల్ సెక్రటరీ జీవీజీ నాయుడులపై కేసు నమోదు చేశారు.  ఐపీసీ సెక్షన్ 341, 290, 21 రెడ్ విత్ 76 సీపీ యాక్ట్ కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fourteen =