అన్నపై అక్కాచెల్లెళ్లు యుద్ధం.. గెలుపెవరిది?

AP Politics Around Viveka.., Ys Viveka Murder Case, Politics Around Viveka, Viveka Murder Case, Viveka Murder Politics, Politics Between YCP And TDP, TDP, YCP, Ys Viveka, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
ys viveka murder case politics between ycp and tdp telugu news

2019 ఏపీ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య ప్రకంపనలు  రేపింది. నాడు ఇదే కీలక అంశంగా రాజకీయ పార్టీలు ప్రచారం చేశాయి. వైఎస్‌ వివేకానందరెడ్డి జగన్‌కు బాబాయ్‌ వరస అవుతారు. రాజశేఖర్‌ తమ్ముడు ఆయన. నాడు తన ఇంట్లోనే శవమై కనిపించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ కేసు నడుస్తూనే ఉంది. ఈ హత్య చేసింది తానేనని దస్తగిరి చెప్పాడు.. అతనే తర్వాత అప్రూవర్‌గా మారాడు. ఈ హత్య వెనుక అవినాశ్‌రెడ్డి ఉన్నారన్నది ప్రతిపక్షాల మాట.

ఐదేళ్ల తర్వాత మళ్లీ వివేకా హత్య అంశం తెరపైకి వచ్చింది.

ఏం జరగబోతోంది?

అసలు దోషి ఎవరు, కుట్రదారు ఎవరు అనేది అంతిమంగా కోర్టు తేల్చనుండగా, కడపలో కాకపోయినా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం వివేకా హత్య అంశం టీడీపీకి కచ్చితంగా ఉపయోగపడుతుందన్న ప్రచారం జరుగుతోంది. జగన్‌ను విలన్‌గా చిత్రీకరించడానికి చంద్రబాబు ఈ అంశంపై పదేపదే మాట్లాడుతున్నారంటున్నారు విశ్లేషకులు. నిజమే జగన్ అక్కాచెల్లెళ్ల ప్రకటనలను ఉటంకిస్తూ ఆయన పదేపదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. అయితే వివేక హత్యకు అసలు కారకుడెవరో తెలిసినా తన అక్కాచెల్లెళ్లతో పాటు చంద్రబాబు ఆ విషయాన్ని పక్కన పెట్టి మరి తనపై బురద జల్లుతున్నారంటున్నారు జగన్‌.

వివేకానందరెడ్డి హత్యకు సూత్రధారి ఎవరన్నది కడప జిల్లా ప్రజలకు తెలుసునని అంటోంది వైసీపీ. కానీ చంద్రబాబు ఈ నిందంతా జగన్‌పై మోపుతున్నారని ఫైర్ అవుతోంది. వివేకానంద రెడ్డిని హత్య చేసి ఆ కిరాతక చర్యను అంగీకరించిన ప్రధాన నేరస్థుడు(దస్తగిరి) కటకటాల వెనుక లేడని, చంద్రబాబు నాయుడు మద్దతుతో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని అంటోంది. మరోవైపు  వివేక హత్యను టీడీపీ సోషల్‌మీడియాలో బాగా వాడుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి వివేక అంశం ఏ మేరకు టీడీపీకి అనుకూలిస్తుందో.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + four =