వైసీపీ కంచుకోటలో ఈ సారి ఎవరు పాగా వేస్తారు?

Where Are The Eyes Of Voters In Kadapa?, Voters In Kadapa, Eyes Of Voters In Kadapa, Kadapa Voters, Kadapa Political, Voters In Kadapa, AP CM Jagan, AP, Janasena, YSRCP, TDP, BJP, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Kadapa Political, voters in Kadapa,Ap Cm Jagan, Ap, Janasena, Ysrcp,TDP, BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డామినేషన్ పరంగా మోస్ట్ పవర్ ఫుల్ జిల్లా ఇది. ఫ్యాక్షన్ కు రాజకీయం తోడైన జిల్లా అని దీనికి పేరు.  ఉమ్మడి కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఇక్కడంతా వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం. అభ్యర్థులు కూడా మెజారిటీ వాళ్లే ఉంటారు. సీఎం సొంత జిల్లా కావడంతో గాలంతా వైసీపీ వైపే ఉండటం కామన్.

గతంలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్నా కూడా  ఇప్పుడు వైసీపీకి  కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లను వైసీపీ గెలుచుకుంది. మెజారిటీలు కూడా భారీగానే వచ్చాయి. ఇప్పుడా పరిస్థితి ఉందా అంటే.. కష్టమే అనే మాట వినిపిస్తోంది. జిల్లాపై పట్టు నిలుపుకున్నా.. ఫలితాల్లో మాత్రం తేడాలుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బద్వేలు నియోజకవర్గం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇక్కడ నుంచి దాసరి సుధ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019ఆమె భర్త వెంకట సుబ్బయ్య 44వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్ ను ఓడించారు. ఆయన మరణంతో వచ్చిన ఉపఎన్నికలో సుధ 90వేల మెజారిటీతో విజయం సాధించారు. బద్వేలులో ఎస్సీ, బలిజ సామాజికవర్గ ఓటర్లు అధికం.

బద్వేలులో అభివృద్ధి లేకపోవడం, వైసీపీ నేతల భూకబ్జాలు, సెటిల్మెంట్లు, అవినీతి వంటివి అధికార పార్టీకి మైనస్ గా చెప్పొచ్చు. సీఎం జగన్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదు.  అక్కడ ఎమ్మెల్సీ రమణారెడ్డిదే ఆధిపత్యం. ఎమ్మెల్యే పూర్తిగా డమ్మీ అయ్యారు. ఈ  ఎన్నికలలో షర్మిల ప్రభావం ఉంటుంది.

జమ్మలమడుగు నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడ నుంచి డాక్టర్ సుధీర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019లో ఆయన టీడీపీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డిపై దాదాపు 52వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ రెడ్డి, బలిజ, మైనార్టీ ఓటర్లు కీలకం. ఇక్కడ చాలా అంశాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ఏమీ చేయలేదు. గంటికోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదు. ఎమ్మెల్యే తీరు, అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్.  ఇక్కడ 1983 నుంచి వరుసగా ఐదుసార్లు టీడీపీ గెలిచింది. ఆ తర్వాత గెలిచింది లేదు.

కమలాపురం నియోజకవర్గం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇక్కడ నుంచి సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై 27వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ రెడ్డి, బలిజ ఓటర్లు కీలకం. అభివృద్ధి లేకపోవడం, కుటుంబ ఆధిపత్యం వైసీపీకి ప్రతికూలంగా ఉన్నాయి. రవీంద్రనాథ్ రెడ్డి సీఎంకు మేనమామ కావడం, వైఎస్ కుటుంబానికి ఉన్న బలం, కేడర్ బలం వైసీపీకి అనుకూలంగా మారనున్నాయి.

ఓవరాల్ గా కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా.. ఈసారి వైసీపీ 4 సీట్లు పక్కాగా గెలిచే అవకాశముంది. మిగిలిన ఆరు సీట్లలో పోటీ హోరాహోరీగా ఉండే ఛాన్సుంది. ఓవరాల్ గా కడప జిల్లాలో టీడీపీకి.. వైసీపీ కంటే వర్గపోరే పెద్దశత్రువులా తయారైంది. చాలా నియోజకవర్గాల్లో టికెట్ కోసం ఎక్కువమంది పోటీ పడుతున్నారు. బలమైన నేతలున్నా గెలుపుకోసం కష్టపడే తీరు మాత్రం కనిపించడం లేదు.దీంతో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశాలెక్కువ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =