వైసీపీ, ఎన్డీఏ కాపులకు ఎన్నీ టికెట్లు ఇచ్చాయి?

How Many Tickets Have Been Given To Kapu.. YCP And NDA ?, How Many Tickets Have Been Given To Kapu, YCP And NDA, YCP Gave More Tickets To Kaapu Leaders, More Tickets To Kaapu Leaders, Kaapu Leaders, TDP, Janasena, BJP, Telugu News, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
ysp gave more tickets to kaapu leaders than tdp janasena bjp telugu news

ఏపీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది కులాలే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఏ కులం ఏ పార్టీకి ఓటు వేస్తుందన్న లెక్కలపై తీవ్ర చర్చ జరగడం ప్రతీ ఎన్నికల సమయంలోనూ షరా మామూలే. ముఖ్యంగా ఎస్సీ, బీసీ ఓట్లతో పాటు కాపుల ఓట్లపై పార్టీల ఫోకస్‌ ఎక్కువగా ఉంటుంది. ఎస్సీలు సాధారణంగా వైసీపీ వైపు ఉంటారన్న ప్రచారం ఎలాగో ఉంది. అటు బీసీల ఓట్లు ఈసారి ఎవరికి పడతాయన్నదానిపై విశ్లేషకులు సైతం సమాధానం చెప్పలేని పరిస్తితులు ఉన్నాయి. అటు కాపుల ఓట్ల గురించి మాత్రం భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత 2019లో వైసీపీకి పట్టం పట్టిన కాపులు ఈ సారి మళ్లీ ఫ్యాన్‌ పార్టీనే ఆధారిస్తారా? లేదా ఎన్డీఏ కూటమి పక్షనా నిలబడతారా అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఎక్కువ టికెట్లు ఇచ్చిన వైసీపీ:

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల కంటే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  కాపు సామాజికవర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చింది.  నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)తో జనసేన పార్టీ (జెఎస్‌పి) పొత్తు పెట్టుకున్నప్పటికీ కాపులకు ఆశించిన స్థాయిలో సీట్లు కేటాయించలేదన్న ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కాపు కులానికి చెందిన నాయకుడు. జనసేనతో దాదాపు ఐదేళ్లుగా పొత్తులోనే ఉన్న బీజేపీ తనకున్న 10 అసెంబ్లీ సీట్లలో ఒక సీటు కూడా కాపు నేతలకు కేటాయించలేదు. ఇక ఓవరల్‌గా కాపు నేతలకు ఎవరు ఎన్ని టికెట్లు ఇచ్చారో చూద్దాం.

YSRCP:

అసెంబ్లీ టికెట్లు: 31

ఎంపీ: 05

NDA:

శాసన సభ సభ్యులు (ఎమ్మెల్యేలు): 23 (TDP-14, JSP-09, BJP-00)

పార్లమెంటు సభ్యుడు (MP): 03

ఏపీ రాజకీయ రంగంలో కాపు ప్రాతినిధ్యానికి వైసీపీ ప్రాధాన్యతని ఈ కేటాయింపు హైలైట్ చేస్తుందన్న టాక్ నడుస్తోంది. గత 2019 ఎన్నికల్లో 32 మంది కాపులకు ఛాన్స్ ఇచ్చిన వైసీపీ అందులో 30 స్థానాలను గెలుచుకోంది. ఈ సారి కూడా అదే స్థాయిలో 31మంది కాపులకు టికెట్లు ఇచ్చింది వైసీపీ. అటు ఎన్డీఏ ఓవరల్‌గా కమ్మ, రెడ్డి కులం నేతలకు టికెట్లు ఇచ్చింది. ఇక కాపు నేదలైన ముద్రగడ, హరిరామజోగయ్య లాంటి నేతలు వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్డీఏ పార్టీలు మాత్రం కాపులు తమవైపే ఉన్నారంటోంది. మరి చూడాలి ఈ సారి ఈ కులం ఓట్లు ఎవరికి పడతాయో!

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =