గవర్నర్‌ బిశ్వభూషణ్ తో భేటీ అయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్

ap governor biswabhusan harichandan, AP Local Body Polls, AP Panchayat polls, AP Panchayat polls 2021, AP SEC, AP SEC Nimmagadda, AP SEC Nimmagadda Ramesh Kumar, AP SEC Nimmagadda Ramesh Kumar Meets Governor, biswabhusan harichandan, Governor, Governor Biswabhusan Harichandan, Mango News, Nimmagadda Ramesh Kumar, Panchayat polls

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సోమవారం నాడు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఈ సమావేశంలో అరగంటపాటు పలు అంశాలపై గవర్నర్ తో ఎస్ఈసీ చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీలో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, విజయవంతంగా ముగిసినట్టు ఎస్‌ఈసీ గవర్నర్ కు వివరించారు. అలాగే ఏకగ్రీవాలు సహా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నివేదిక, మార్చి 10 న జరగబోయే 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయాలను కూడా గవర్నర్‌ బిశ్వభూషణ్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వివరించినట్టు సమాచారం.

ముందుగా సోమవారం ఉదయం పంచాయతీ ఎన్నికల పక్రియ విజయవంతంగా ముగియడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ యంత్రాంగం అంకితభావంతో సమర్థవంతంగా పనిచేసిందని చెప్పారు. 90 వేల మంది ఉద్యోగ సిబ్బంది, 50 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని అన్నారు. ప్రతి విడతలో 80 శాతం పైగా పోలింగ్ నమోదయిందని, ఎక్కడా కూడా రీపోలింగ్‌, ఎన్నికలు వాయిదాపడడం గానీ జరగలేదన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు సమన్వయంతో చేసారని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 5 =