పెరుగుతున్న కరోనా కేసులు, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు ఎక్కువుగా జరపాలని కేంద్రం లేఖ

Centre Asks to Conduct More RT-PCR Tests, Centre Writes a Letter to States Witnessing Spike in Corona Cases, Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, India Coronavirus, India Covid-19 Updates, India Fears Second COVID-19 Wave, India Fears Second COVID-19 Wave With Three New Mutants, Mango News, New Confirmed Corona Cases, Second COVID-19 Wave, total corona cases in india today, total corona positive in india

దేశంలో గతకొన్ని రోజులుగా మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, జమ్మూ కశ్మీర్‌లలో రోజువారీగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించిందని కేంద్రం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతమున్న యాక్టివ్‌ కేసుల్లో 74 శాతం కేవలం కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఉన్నాయని చెప్పారు. అలాగే మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, చండీగర్ వంటి 5 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా పాజిటివ్ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ నమోదైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలు కరోనా మహమ్మారి కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.

ముఖ్యంగా కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్యను పెంచాలని, ఎక్కువగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు జరపాలని కేంద్రం సూచించింది. అలాగే రాపిడ్ యాంటిజెన్ పరీక్షలలో నెగటివ్ వచ్చినప్పటికీ మళ్ళీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు ద్వారా నిర్ధారణ చేసుకోవాలని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలు, సమగ్ర నిఘాపై మళ్ళీ దృష్టి సారించాలని, జిల్లాలో ఉన్న కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని చెప్పారు. క్రమం తప్పకుండ కరోనా పరీక్షలు చేయటంతో పాటుగా వాటిపై జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో ఒకవేళ కరోనా కొత్త వేరియంట్/రూపంలో వ్యాప్తి చెందుతుందా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఇక ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా మరణాలు నమోదవుతున్న జిల్లాల్లో చికిత్స మీద మరింత దృష్టిపెట్టాలని కేంద్రం పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − four =