యూఎస్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు అండగా ఏపీ ఎన్ఆర్టీఎస్

APNRTS President Venkat Medapati Announces Will Support Students Who Returned From US,APNRTS President Venkat Medapati,Venkat Medapati Announces Will Support Students,Support Students Who Returned From US,Mango News,Mango News Telugu,AP NRTS,US,Some students from America, India,students from AP, CM has focused,APNRTS President Latest News,APNRTS President Latest Updates,Venkat Medapati News Today,Venkat Medapati Latest News,Venkat Medapati Latest Updates

యూఎస్ నుంచి డీపోర్టు అయిన విద్యార్థులకు ఏపీ ఎన్ఆర్టీఎస్ సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఏపీ ఎన్ఆర్టీఎస్ సంప్రదించాలని అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. అమెరికా నుంచి కొంత మంది విద్యార్థులు తిప్పి భారత్‌కు పంపించారు. ఇందులో ఏపీలో విద్యార్థులు కూడా ఉన్నారు. దీంతో ఈ విషయంపై సీఎం దృష్టి సారించారని వెంకట్ మేడపాటి చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వీరి సమస్య పరిష్కరించాలని సీఎం జగన్ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరినట్లు వివరించారు.

యూఎస్ వెళ్లే విద్యార్థులు యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ వద్ద కస్టమ్స్‌, బోర్డర్‌ ప్రొటెక్షన్‌ అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎలాంటి భయం లేకుండా స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రస్తుతం అనేక కన్సల్టెన్సీలు వెలిశాయని.. మంచి పేరున్న ఏజెన్సీల ద్వారా అమెరికా వెళ్లాలని సూచించారు. విద్యార్థులు 8632340678 లేదా 8500027678 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లిన 21 మంది విద్యార్థులను యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు తిప్పి పంపారు.

అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో చేరేందుకు భారత్‌కు చెందిన 21 విద్యార్థులు గురువారం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా, షికాగో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారు ఎయిర్ పోర్టులో దిగగానే ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులను పలు డాక్యుమెంట్లు చూపాలని కోరారు. ఆ తర్వాత వారిని ఎయిరిండియా విమానంలో తిరిగి భారత్‌కు పంపారు. విద్యార్థులు ఇమిగ్రేషన్ అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.

దీంతో ఎలాంటి కారణం లేకుండా 21 మంది విద్యార్థులను డిపోర్ట్ చేశారు. దీంతో ఈ 21 మంది విద్యార్థులు మరో 5 ఏళ్ల వరకు అమెరికా వెళ్లడానికి సాధ్యం కాదు. ఇందులో ఏపీకి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న విద్యార్థులను సుమారు 16 గంటల పాటు ఇరుకు గదుల్లో కూర్చోబెట్టినట్లు విద్యార్థులు చెప్పారు. ఆ తర్వాత తక్షణమే ఇండియా తిరిగి వెళ్లిపోవాలని చెప్పారు. తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని కొందరు ప్రశ్నించగా.. జైలుకు పంపిస్తామని బెదిరించినట్లు వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seven =