తొలిసారి లోక్‌సభ బరిలో ప్రియాంక గాంధీ..

Congress General Secretary Priyanka Gandhi Vadra To Contest in 2024 Lok Sabha Elections,Congress General Secretary Priyanka Gandhi Vadra,Priyanka Gandhi Vadra To Contest in 2024,2024 Lok Sabha Elections,Priyanka Gandhi in Lok Sabha Elections,Mango News,Mango News Telugu,Rahul Gandhi, Amethi,Priyanka Gandhi, Shiv Sena Thackeray MP Priyanka Chaturvedi, Prime Minister Narendra Modi, Lok Sabha elections,Congress General Secretary,Priyanka Gandhi Vadra Latest News,Priyanka Gandhi Vadra Latest Updates,Priyanka Gandhi Vadra Live Updates

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారనే దానిపై క్రమంగా స్పష్టత వస్తోంది. ఇప్పటికే యూపీ కాంగ్రెస్ ఛీఫ్‌గా తాజాగా బాధ్యతలు చేపట్టిన అజయ్ రాయ్.. రాహుల్ గాంధీ తిరిగి అమేథీ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. దీంతో రాహుల్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రియాంక గాంధీ తొలిసారి బరిలోకి దిగే సీటు ఏదనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని శివసేన థాక్రే వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది తెలిపారు. ఇండియా కూటమి ముందంజలో ఉందని, కూటమిలో ఎవరికి సీటు సరిపోతుందో చర్చిస్తుందని ఆమె వెల్లడించారు. ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తే ఆమె విజయం సాధిస్తుందని ప్రియాంక చతుర్వేది జోస్యం చెప్పారు.

దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రజలకు తెలుసని, రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి తదుపరి ప్రధాని ఎన్నిక కానున్నందున ఎర్రకోటపై నుంచి మోదీ చేసే చివరి ప్రసంగం ఇదేనని ప్రియాంక చతుర్వేది అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల బాధలు, మహిళలపై దౌర్జన్యాలు అన్నీ పెరిగాయని ఆమె ఆరోపించారు. అలాగే ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారన్నారు. బీజేపీని ఈ అన్ని అంశాలపై నిలదీస్తారని కూడా తెలిపారు.

మరో ఏడాదిలోగా ఇండియా కూటమి ప్రధాని వచ్చి దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రియాంక చతుర్వేది ధీమా వ్యక్తం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ బీజేపీలో చేరడంపై వచ్చిన ఊహాగానాలపైనా ప్రియాంక స్పందించారు. శరద్ పవార్ ఈ విషయంపై చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారని, ఇండియా కూటమి పొత్తులో ఉన్నందున.. తాము బీజేపీతో ఎప్పటికీ చేతులు కలపబోనన్నారని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 18 =