అమర జవాన్ జ్యోతి.. జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం

Amar Jawan Jyoti Flame, Amar Jawan Jyoti Flame To Be Merged With National War Flame, Amar Jawan Jyoti Flame To Be Merged With National War Flame Today Details Here, Amar Jawan Jyoti for our soldiers, Amar Jawan Jyoti To Be Put Out And Merged With National War Flame, Eternal flame, Eternal flame to be extinguished, Eternal flame to be merged with National War Flame, Indian Army Official, Mango News, Marshal Balabadhra Radha Krishna, National War Flame, National War Memorial

అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా శుక్రవారం తెలిపింది. భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల స్మారకార్థం ఈ అమర జవాన్ జ్యోతిని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేశారు. భారత్-పాకిస్థాన్ యుద్ధంలో అమరులైన 3,843 మంది భారతీయ సైనికుల స్మారకార్థం అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఈ జ్యోతిని ఏర్పాటు చేసింది. దీనిని ఇందిరా గాంధీ 1972 జనవరి 26న ఆవిష్కరించారు. భారతీయ దళాల అధిపతులు, విదేశీ నేతలు ఇక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు. గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాన మంత్రి అమర వీరులకు నివాళులర్పించటం రివాజు.

జాతీయ యుద్ధ స్మారకం.. ఇండియా గేట్‌కు సుమారు 500 మీటర్ల దూరంలో ఉంది. ఇండియా గేట్ ఎత్తు 42 మీటర్లు. జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్మించింది. భారత దేశ పరిరక్షణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన భారతీయ సైనికుల స్మారకార్థం దీనిని నిర్మించింది. 2019 ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించారు. అమరులకు శ్రద్ధాంజలి ఘటించే అన్ని కార్యక్రమాలను ఇక్కడే నిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా అమరులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఈ స్మారకంపై 25,942 మంది అమర వీరుల పేర్లను లిఖించారు.

‘‘అమర జవాన్ జ్యోతి 1971లో జరిగిన యుద్ధం, ఇతర యుద్ధాల్లో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటిస్తోంది. ఒకటో ప్రపంచ యుద్ధంలోనూ, ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్దంలోనూ బ్రిటిష్ పాలకుల తరపున పోరాడిన కొందరు అమరుల పేర్లు మాత్రమే ఇండియా గేట్‌పై లిఖించి ఉన్నాయి. ఇది మన వలస పాలనకు ప్రతీక. 1971లో, ఆ తర్వాత, ముందు జరిగిన, అన్ని యుద్ధాల్లోనూ అమరులైన భారతీయ అమర వీరుల పేర్లన్నీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్నాయి. అందుకే, అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించే జ్యోతి.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండటమే నిజమైన శ్రద్ధాంజలి అర్పించడం అవుతుంది’’ అని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + twelve =