వల్లభనేని వంశీ ఇమేజ్..యార్లగడ్డ వెంకట్రావ్ మైలేజ్

Tough Fight In Gannavaram, Gannavaram Tough Fight, Gannavaram, Vallabhaneni Vamsi, Yarlagadda Venkatrav, YCP, TDP, Janasena, Chandrababu, Jagan, TDP Leaders, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telug
Gannavaram, Vallabhaneni Vamsi,Yarlagadda Venkatrav,YCP, TDP, Janasena, Chandrababu, Jagan, TDP leaders,

ఏపీ ఎన్నికలలో నామినేషన్ల పర్వం షురూ కావడంతో..నేతలంతా ప్రచారాలలో స్పీడును పెంచారు. ఓ వైపు పార్టీలో నామినేషన్ల హడావుడి.. మరోవైపు ప్రచారంతో జనాలలోకి వెళ్తూ నేతలంతా  దూసుకుపోతున్నారు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వల్లభనేని వంశీ, టీడీపీ నుంచి పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు  తమదైన శైలిలో  ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

కృష్ణా జిల్లా గన్నవరం పేరు చెబితేనే అది టీడీపీకి కంచుకోట అని చెబుతూ ఉంటారు. 2009 నుంచి కూడా ఇక్కడ టీడీపీ జెండానే ఎగురుతోంది.  2014,2019లో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ విజయం సాధించారు.ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వంశీ టీడీపీని వీడి అధికార వైసీపీ కండువా కప్పుకుని …అదే గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు.

అలా వల్లభనేని వంశీ వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా.. గత ఎన్నికల్లో  వైసీపీ నుంచి వంశీతో పోటీ పడిన  యార్లగడ్డ వెంకట్రావ్ ఈసారి తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేస్తుండటం అక్కడ ఆసక్తికరంగా మారింది. దీంతో గన్నవరం స్థానాన్ని  టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వల్లభనేని వంశీని చూసి గన్నవరం ఓటర్లు ఓటేయలేదని.. టీడీపీ వల్లే వంశీని గెలిపించారనే విషయం వంశీకి అర్దం అయ్యేలా చేయాలని చూస్తోంది.

మరోవైపు చంద్రబాబు, లోకేష్‌ అంటే మండిపడుతున్న వంశీ కాస్త ఘాటుగానే  విమర్శలు చేస్తారు. అందుకే ఆయన్ని ఓడించేందుకు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి  చేరిన సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావుకు  టికెట్ ఇచ్చారు చంద్రబాబు. తాను చేసిన సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయనే  ధీమాతోనే వెంకట్రావ్ ప్రచారాలను సాగిస్తున్నారు. ఇటు వంశీ  జగన్ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయనే నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఇద్దరు నేతలు ఆర్థికంగా గట్టి పట్టున్న వారే కావడంతో.. గన్నవరం సీటులో గెలిచేది ఎవరంటూ ఉత్కంఠ కొనసాగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =