అంజనాద్రిలో హనుమాన్‌ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ నిర్వహించిన టీటీడీ

Anjanadri, Anjanadri in Tirumala, Anjanadri in Tirumala is Lord Hanuman’s Birthplace, Anjanadri in Tirumala is the birthplace of Lord Hanuman, Development of Hanuman’s Birth Place, Hanuman’s Birth Place, Lord Hanuman Was Born On Anjanadri, Lord Hanuman Was Born On Anjanadri At Tirumala, Mango News, TTD Announces that Anjanadri in Tirumala, TTD Announces that Anjanadri in Tirumala is Lord Hanuman’s Birthplace, TTD Organized Bhumi Puja, TTD Organized Bhumi Puja For The Development, TTD Organized Bhumi Puja For The Development of Hanuman’s Birth Place

తిరుమల కొండపై ఆకాశగంగ సమీపాన ‘హనుమాన్‌’ జన్మస్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి, చిత్రకూటం పద్మభూషణ్‌ శ్రీ రామభద్రాచార్య మహరాజ్, ఆయోధ్య రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌ కోశాధికారి స్వామి గోవిందదేవ్‌గిరీజీ మహారాజ్, వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. అంజనాద్రిలో అభివృద్ధి పనులకి భూమిపూజ చెయ్యడం గొప్ప కార్యక్రమం అని టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. భూమిపూజ అనంతరం ఛైర్మన్‌ సుబ్బారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.

“కొందరు హనుమ జన్మస్థలంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఆకాశగంగలో ప్రస్తుతం ఉన్న ఆలయం అలాగే ఉంటుందని ఆయన వెల్లడించారు. అంజనాదేవి ఆలయంలో ఎలాంటి మార్పులు చేయబోమని తెలిపారు. భక్తులకి సౌకర్యమైన వసతులు ఏర్పాటు చేస్తాము. వివాదాల జోలికి మేము వెళ్లడం లేదు. హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడని టీటీడీ నమ్ముతోందని స్పష్టం చేశారు. కనుకే ఆకాశగంగ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని చెప్పారు. ట్రస్టు ద్వారా వచ్చే నిధులను ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నాము. అలాగే, జమ్మూలో రూ.35 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం నిర్మాణం మరో సంవత్సరంలో పూర్తి కానున్నట్లు తెలిపారు”.

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ.. “తిరుమల వేంకటేశ్వరస్వామి పాదాల చెంత హనుమాన్ జన్మ స్థలానికి భూమిపూజ జరిగింది. వేదాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలకట్టలేని ఆస్థి తిరుమల శ్రీవారి ఆలయం. స్వామి అనుగ్రహం అనుమతి లేనిదే ఏదీ జరగదు. అన్నమయ్య, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వంటి మేటి భక్తులు  వేంకటేశ్వరస్వామిని ప్రత్యక్షంగా దర్శించారు. హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అని ఏదో మాటవాళీగా చెప్పింది కాదు, ఎంతోమంది వేదపండితులు, శాస్త్ర పండితులు దీనిపై ఎన్నో పరిశోదానాలు చేసి నిర్థారించిన యదార్థం” అని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 20 =