కూటమిలో అంతర్గత పోరు.. వైజాగ్‌ సౌత్‌ టికెట్‌పై ఉత్కంఠ!

Internal Fight In The Alliance.. Excitement On Vizag South Ticket!, Internal Fight In The Alliance, Excitement On Vizag South Ticket, Vizag South Constituency Fight, Janasena Internal War Over Ticket, Vizag South Ticket, Vizag Ticket, Vizag Political News, AP Elections 2024, Telugu News, Lok Sabha List, Chandra Babu, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
vizag south constituency fight janasena internal war over ticket amid ap elections 2024 telugu news

వైసీపీ ఎప్పుడో అభ్యర్థుల లిస్ట్‌ ప్రకటించేసుకుంది. మార్చి 16న మొత్తం జాబితాను జగన్‌ రిలీజ్ చేశారు. అంతకముందే విడుతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది వైసీసీ. భారీ స్థాయిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చింది. ఇదంతా గత డిసెంబర్‌ నుంచే మొదలైన ప్రక్రియ. నిజానికి రెండేళ్ల ముందు నుంచే అన్నీ నియోజకవర్గాల నుంచి రిపోర్టులు తెప్పించుకోని గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టింది వైసీపీ. ఇటు జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు చాలా ఆలస్యంగా ఫిక్స్ అయ్యింది. బీజేపీ చివరి వరకు నాన్చింది. ఈ జిడ్డు ధోరణి కారణంగా అభ్యర్థుల ప్రకటన లేట్ అవుతూ వచ్చింది. ఇప్పటికీ మొత్తం లిస్ట్‌ ప్రకటించలేదు. కొన్ని స్థానాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎవరికీ టికెట్ ఇవ్వాలో తెలియని స్థానాలపై చంద్రబాబు-పవన్‌-బీజేపీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. అందులో విశాఖ సౌత్‌ సీటు ఒకటి. ఇది ఎవరికి దక్కుతుందో ఇప్పటికీ సస్పెన్సే!

విశాఖలోని దాదాపు మిగిలిన నియోజకవర్గాల్లోని సీట్లపై స్పష్టత వచ్చినప్పటికీ దక్షిణ నియోజకవర్గంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గతంలో ఈ సీటును జనసేన పార్టీ అభ్యర్థికి రిజర్వ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ దక్షిణ నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే ఈ సెగ్మెంట్ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మూడేళ్లుగా పలు పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయనకు సౌత్ సెగ్మెంట్ టికెట్ ఇస్తారనే భావనలో బాబ్జీ మద్దతుదారులు ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేన అభ్యర్థికి కేటాయించారు. దీంతో గండి బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినా.. ఆయన మాత్రం టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

మధ్యలో వచ్చిన సాదిక్:

ఇలా ఓవైపు గండి బాబ్జీ సెగ కొనసాగుతూనే ఉండగా ఇంతలో జీవీఎంసీ కార్పొరేటర్ మహ్మద్ సాధిక్ సీన్‌లోకి దిగారు. వైజాగ్ సౌత్‌ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. వంశీకి సీటు కేటాయించవద్దని..  సాదిక్‌కు అవకాశం ఇవ్వాలని అయన మద్దతుదారులు జనసేన పార్టీ పెద్దలను కోరుతున్నారు. గతంలో సాదిక్ వైసీపీలో ఉన్నారు. అప్పుడు కూడా దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌తో ఆయనకు ఇలాంటి విభేదాలే ఉన్నాయి. మరోవైపు పార్టీ అధిష్టానం దక్షిణ నియోజకవర్గాన్ని పెండింగ్‌లో పెట్టడానికి ఇదొక్కటే కారణం కాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దీని వెనుక పెద్ద యాక్షన్ ప్లాన్ ఉండొచ్చని తెలుస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఈ రెండు రోజుల్లో సౌత్ సీటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న నార్త్ నియోజకవర్గాన్ని బీజేపీకి, భీమునిపట్నం టికెన్‌ను టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల్లో ఈ స్థానాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 14 =