విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్‌ను గెలిపించుకురావాలి – వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్

CM Jagan Calls YSRCP Workers To Win Devineni Avinash From Vijayawada East Constituency in Next Election,If We Win The Election This Time, We Will Have Power For The Next 30 Years,Cm Jagan With Ycp Workers,Vijayawada East Constituency,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates,Ap Bjp Party,Varahi Ready For Election Battle,Campaign Vehicle Varahi,Varahi Campaign Vehicle,Campaign Vehicle Varahi News And Live Updates,Nara Lokesh Padayatra,Lokesh Padayatra

వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకురావాలని సూచించారు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని, దీనిలో భాగంగా గడచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల వద్దకు తీసుకెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని నొక్కిచెప్పారు.

ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో మన లక్ష్యం 152 కాదని, 175కి 175 స్థానాలు గెలవడమేనని మరోసారి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. ఆ తర్వాత 30 ఏళ్ళు అధికారం మనదే అని సీఎం జగన్ చెప్పారు. అందుకే రానున్న ఎన్నికలలో కూడా అధికారమే లక్ష్యంగా వైసీపీ నేతలంతా కలిసి పనిచేయాలని, విబేధాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అందరూ ఒక్కటి కావాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఇక ఇదిలా ఉంటే, సీఎం జగన్ ప్రకటనతో అధికార పార్టీ నుంచి తదుపరి ఎన్నికలకు టికెట్ కన్ఫర్మేషన్ పొందిన తొలి అభ్యర్థి దేవినేని అవినాష్ అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =