ఎపిసోడ్ 4 (జూలై24) హైలైట్స్: చిన్న పిల్లల టాస్క్,హేమ-రాహుల్ వాగ్వాదం

Bigg Boss 3 Telugu EPISODE 4 Main Highlights, Bigg Boss Episode 4 Latest News, Bigg Boss Season 3 Telugu Episode 4 Highlights, Early Clashes Set The Tone For Season 3 Big Boss, Fight Between Hema and Rahul Sipligunj in Bigg Boss Episode 4 Highlights, Mango News, Preview Rahul picks up a fight with Hema in Episode 4

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3 వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. జులై 24న ప్రసారమైన బిగ్ బాస్ 3 నాల్గోవ ఎపిసోడ్ లో సభ్యుల మధ్య కిచెన్ వ్యవహారాలకు సంబంధించి వాదనలు పెరిగాయి, బిగ్ బాస్ చిన్న పిల్లల్లా వ్యవహరించాలని టాస్క్ ఇవ్వడంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

ఎపిసోడ్ 4 (జూలై24) హైలైట్స్: చిన్న పిల్లల టాస్క్, హేమ-రాహుల్ వాగ్వాదం

  • ఉదయమే టీ విషయంలో సభ్యుల మధ్య గొడవ మొదలైంది, టీ నీళ్లలా ఉంటున్నాయని కంప్లైంట్స్ రావడంతో హేమ సభ్యులపై కోపాన్ని వ్యక్తం చేసింది
  • వరుణ్ సందేశ్ – వితికా షెరు దంపతులు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు
  • బిగ్ బాస్, సభ్యులందరికి చిన్నపిల్లలుగా వ్యవహరించాలని టాస్క్ ఇచ్చాడు, వరుణ్ సందేశ్, పునర్నవి ని టీచర్స్ గా నియమించాడు
  • సభ్యులంతా టాస్క్ లో మునిగిపోయి, వింత వింతగా చేసారు, సభ్యులు టాస్క్ లో మునిగిపోయి ప్రవర్తించడంతో వరుణ్ సందేశ్, పునర్నవి వారిని కంట్రోల్ చేయలేక పోయారు
  • మహేష్ విట్టా మాత్రం సైలెంటుగా ఉండిపోయాడు
  • మహేష్ ని కర్రోడు అనడంతో బాధపడి, రవికృష్ణ కు వార్నింగ్ ఇచ్చాడు, తరువాత రవికృష్ణ మహేష్ కు సారీ చెప్పాడు. పునర్నవి కి మహేష్ కంప్లైంట్ చేయడంతో, తన ఆట తనను ఆడమని ఒక టీచర్ గా మహేష్ కు సర్ది చేప్పింది
  • కిచెన్ వ్యవహారాలకు సంబంధించి హేమ, రాహుల్ మధ్య వాగ్వాదం జరిగింది, గట్టిగా అరుచుకోవడంతో సభ్యులు రాహుల్ ని గార్డెన్ ఏరియాకి తీసుకెళ్తారు
  • తరువాతి ఎపిసోడ్ లో కూడ గొడవ కొనసాగేలా ఉంది. ఈసారి చపాతీ ఎవరో తిన్నారనే విషయం మీద వాదులాడుకుంటున్నారు. ఏది ఏమైనా మొదలైన మూడు రోజులకే గొడవలు, అరుచుకోవడాలతో షో ప్రత్యేకంగా మారింది.
  • ప్రజలు ఎంటర్టైన్మెంట్ పై శ్రద్ద పెట్టాలని కోరుకుంటున్నారు, మునుముందు ఇంకా షో లో ఏమి జరుగుతాయో వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 1 =