గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ముఖేష్ అంబానీ కీలక ప్రకటన.. ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు

Global Investors Summit-2023 Reliance Industries Chairman Mukesh Ambani Announces To Set up 10 Gigawatt Solar Energy Project in AP,Reliance Industries Chairman Mukesh Ambani,Global Investors Summit-2023 Reliance Industries,Mukesh Ambani Announces To Set up 10 Gigawatt Solar Energy Project,Solar Energy Project in AP,Mango News,Mango News Telugu,AP Global Investors Summit 2023,Mukesh Ambani About AP Global Investors Summit 2023,Mukesh Ambani Comments On AP Global Investors Summit 2023,Mukesh Ambani At AP Global Investors Summit 2023,AP Global Investors Summit Updates,AP Investors Summit In Vishakapatnam

ఆంధ్రప్రదేశ్‌లో 10 గిగావాట్ల పునరుత్పాదక సౌరశక్తి ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు తమ గ్రూప్ పెట్టుబడులు పెట్టనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ప్రారంభ సెషన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌లో భాగస్వామినైనందుకు సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఏపీలో మానవ వనరులతో పాటు సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఇక్కడి నుంచే వచ్చారని తెలిపారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని, మా పెట్టుబడులను కొనసాగిస్తామని, దీనిలో భాగంగా 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ముఖేష్ అంబానీ వెల్లడించారు.

కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత విజయవంతమైన కంపెనీలలో ఒకటన్న విషయం తెలిసిందే. ఇక ఈ 10 గిగావాట్ల ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ కార్యక్రమాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ ప్లాంటును సుమారు 25,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి సహాయపడుతుందని ఏపీ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇది స్వచ్ఛమైన శక్తిని ఉత్పత్తి చేస్తుందని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, అలాగే వాతావరణ మార్పులను ఎదుర్కోవదాంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 2 =