అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎస్ శాంతి కుమారి

Telangana CS Santhi Kumari Inspected the Construction Works of 125 Feet Ambedkar Statue,Telangana CS Santhi Kumari,CS Santhi Kumari Inspected the Construction Works,Construction Works of 125 Feet Ambedkar Statue,CS Santhi Kumari Inspected Ambedkar Statue,Mango News,Mango News Telugu,Telangana CS conducts surprise inspection,CS directs officials to complete works,CS Santhi Kumari Latest News,CS Santhi Kumari Latest Updates,Telangana Ambedkar Statue News

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పీవీమార్గ్ నెక్లెస్ రోడ్ మార్గంలో 125 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న భారీ అంబేద్కర్ విగ్రహా పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజున (ఏప్రిల్ 14) ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించడంతో ఈ విగ్రహ పనుల పురోగతిని సీఎస్ పరిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఈ.ఎన్.సి గణపతి రెడ్డిలతో కలసి పనులను పరిశీలించిన సీఎస్ శాంతి కుమారి, విగ్రహ, సంబంధిత పనులన్నింటినీ ఏప్రిల్ 10 తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఈ విగ్రహ క్రింది భాగంలో నిర్మిస్తున్న వందమంది పట్టే కెపాసిటీ కలిగిన యాంపి థియేటర్ పనులను సీఎస్ పరిశీలించారు. ఈ విగ్రహ ఆవరణలో ఏర్పాటుచేస్తున్న ల్యాండ్ స్కేపింగ్ పనులు, ఇతర సివిల్ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, దీనికి ముందు డా.బీఆర్ అంబేద్కర్ సెక్రెటేరియేట్ నిర్మాణ పనుల పురోగతిని కూడా సీఎస్ శాంతి కుమారి పరిశీలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + nineteen =