ఏపీలో పలు స్థానిక సంస్థల, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ECI Releases Schedule for AP Local Authorities Constituencies Graduates Teachers Quota MLC Elections,ECI Releases Schedule,AP Local Authorities Constituencies,Graduates, Teachers Quota MLC Elections,Mango News,Mango News Telugu,Mlc Elections Ap,Ap Mlc Elections 2023,Eligibility To Vote In Mlc Elections,Graduate Mlc Elections In Ap,Graduate Mlc Elections In Ap 2023,Graduate Mlc Elections In Ap Date,Mlc Elections,Mlc Elections In Ap,Mlc Elections In Ap 2022 Apply Online,Mlc Elections In Ap 2023 Date,Mlc Elections In Ap 2023 News ,Mlc Elections Registration In Ap,Mlc Elections Status,Mlc Elections Telangana

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు స్థానిక సంస్థల, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం షెడ్యూల్‌ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ లో స్థానిక సంస్థల కోటా కింద అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలులో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, పశ్చిమగోదావరిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అనంతపురంలో దీపక్ రెడ్డి గుణపతి, కడపలో బీటెక్ రవిల పదవీకాలం 2023 మార్చి 29తో ముగియనుంది. అలాగే నెల్లూరులో వాకాటి నారాయణరెడ్డి, పశ్చిమ గోదావరిలో అంగర రామ్ మోహన్, మంతెన వెంకట సత్యనారాయణ రాజు, తూర్పుగోదావరిలో చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళంలో విజయరామ రాజు చత్రుచర్ల, చిత్తూరులో బిఎన్ రాజసింహులు, కర్నూల్ లో కేఈ ప్రభాకర్ ల యొక్క పదవీ కాలం 2023, మే 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈసీ తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహించి, మార్చి 16న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు స్థానాలకు 2023, మార్చి 29వ తేదీతో పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో ఈసీ తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఇందుకోసం ఫిబ్రవరి 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహించి, మార్చి 16న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఈసీ వెల్లడించింది.

ఏపీలో స్థానిక సంస్థల, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్:

  • నోటిఫికేషన్ జారీ – ఫిబ్రవరి 16
  • నామినేషన్లకు ఆఖరితేదీ – ఫిబ్రవరి 23
  • నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 24
  • ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఫిబ్రవరి 27
  • ఎన్నిక జరిగే తేదీ – మార్చి 13
  • పోలింగ్ సమయం – ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
  • ఓట్ల లెక్కింపు – మార్చి 16.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 9 =