జ‌న‌సేనాని ల‌క్ష్యం నెర‌వేరేనా..?

Is Jana Sena's Goal Different?,Assembly Elections,Pawan Kalyan,TDP,CM Jaganmohan Reddy,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,CM YS Jagan,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan News,Pawan Kalyan Latest Updates,Pawan Kalyan Bus Yatra,BJP,Pawan Kalyan Election Campaign,Jana Sena,Jana Sena News,Jana Sena Latest News

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన జ‌న‌సేన పార్టీ ఒకే ఒక్క సీటుతో స‌రిపెట్టుకుంది. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీచేసిన రెండు స్థానాల‌లోనూ ఓడిపోయి అవ‌మానాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. గ‌తం గురించి ఆలోచించి కుంగిపోకుండా, ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకుని ఈఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. దీనిలో భాగంగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌లకు సిద్ధ‌మ‌య్యారు. సీట్ల లెక్క చూడ‌కుండా, ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో జ‌న‌సేన ప్రాతినిధ్యం ఉండాల‌నే ఏకైక ల‌క్ష్యంతో కొన్ని త్యాగాల‌కు సిద్ధం అయ్యారు. కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్ల‌తో స‌రిపెట్టుకున్నారు.

ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని వారి గెలుపు కోసం విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాదు.. తాజాగా వారికి మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో బీ-ఫారాలను కూడా అందజేశారు. తొలి బీఫారంను తెనాలి నియోజకవర్గం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు పవన్ కల్యాణ్ అందజేశారు. ఈ సంద‌ర్భంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీని పవన్ నిబద్దతతో నడుపుతున్నారని అన్నారు. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పార్టీని నడిపారని, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని, వైసీపీని ఓడించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. సమర్ధులైన అభ్యర్థులను పవన్ ఎంపిక చేశారని నాదెండ్ల అన్నారు. ఆ స‌మ‌ర్థుల్లో ఎంద‌రు నెగ్గుతారు అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

తెలుగుదేశం-బీజేపీ క‌ల‌వ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన జ‌న‌సేనాని.. ఇప్పుడు కూట‌మిని అధికారంలోకి తెచ్చేందుకు కూడా అంతే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చంద్ర‌బాబుతో క‌లిసి మ‌రీ ప్ర‌చారం సాగిస్తున్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని దించ‌డ‌మే ఏకైక ల‌క్ష్యంగా శ్ర‌మిస్తున్నారు. ప‌వ‌న్ వెనుక తాను ఉన్నానంటూ తాజాగా అన్న చిరంజీవి భ‌రోసా ఇవ్వ‌డంతో మ‌రింత ఉత్సాహంగా ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు జ‌న‌సేనాని. ఒంట‌రిగా పోటీచేసి సాధించ‌లేని గెలుపును.. కూట‌మిగా, క‌లిసిక‌ట్టుగా సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి కేంద్రీక‌రిస్తూనే.., జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున కూడా ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు. ఈక్ర‌మంలో జ‌న‌సేనాని ల‌క్ష్యం ఎంత వ‌ర‌కూ నెర‌వేరుతుందో అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 11 =