అసెంబ్లీ ఎన్నికల బరిలోకి నాగబాబు

AP Elections, Nagababu, Pawan kalyan, Janasena, Tirupati, Jana Sena, actor naga babu, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates, Mango News Telugu, Mango News
AP Elections, Nagababu, Pawan kalyan, Janasena, Tirupati

పోయినసారి ఒంటరిగా బరిలోకి దిగి ఫెయిల్ అయిన జనసేన.. ఈసారి తెలుగు దేశం పార్టీతో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. తమకు కేటాయించిన స్థానాల్లో ఎలాగైనా గెలుపొందాలని వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తోంది. ఈ మేరకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు జనసేన కసరత్తు చేస్తోంది. ఇక జనసేలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కీలకంగా కొనసాగుతున్నారు. కొంతకాలంగా పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈక్రమంలో నాగబాబు సేవలను పార్టీ కోసమే కాకుండా.. ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా వాడుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. అందుకే ఆయన్ను ఈసారి ఎన్నికల బరిలోకి దించాలని ఆలోచిస్తున్నారట.

మొదటిసారి నాగబాబు 2019 ఎన్నికల బరిలోకి దిగారు. జనసేన తరుపున నర్సాపురం స్థానం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించినప్పటికీ.. ఆ సమయంలో ఆయన్ను నర్సాపురం ప్రజలు ఆదరించలేదు. వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు చేతిలో నాగబాబు ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత నుంచి నాగబాబు జనసేనలో క్రియాశీలకంగా ఉంటూ వస్తున్నారు. రాజకీయాలపై కూడా పట్టు సాధించారు. ఈక్రమంలో ఆయన్ను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయించాలని పవన్ అనుకుంటున్నారట.

అయితే పోయినసారి పోటీ చేసిన నర్సాపురం నుంచి బరిలోకి దింపుదామనుకుంటే.. పొత్తులో భాగంగా ఆ స్థానం తెలుగు దేశం పార్టీకి వెళ్లిందట. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆ స్థానం నుంచి తెలుగు దేశం పార్టీ తరుపున బరిలోకి దిగనున్నారట. ఇప్పటికే చంద్రబాబు నాయుడు రఘరామకు హామీ కూడా ఇచ్చేశారట. అయితే ఇప్పుడు నాగబాబు విషయంలో పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను లోక్ సభ ఎన్నికల్లో కాకుండా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని పవన్ ఆలోచిస్తున్నారట.

అవును.. నాగబాబును అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు పవన్ కసరత్తు చేస్తున్నారట. రాయలసీమలోని తిరుపతి నుంచి నాగబాబును బరిలోకి దించనున్నారట. అయితే కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఈసారి తిరుపతి నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన అభిమానులు, అక్కడి పార్టీ కేడర్ కూడా ఆయన్ను తిరుపతి నుంచే పోటీ చేయాలని కోరుతున్నారట. ఎలాగైనా గెలిపించుకొని తీరుతామని పట్టు పడుతున్నారట. కానీ పవన్‌కు మాత్రం అక్కడి నుంచి పోటీ చేయడం ఏమాత్రం ఇష్టం లేదట. గోదావరి జిల్లాల్లోనే పోటీ చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారట.

ఈక్రమంలో తన సోదరుడు నాగబాబును తిరుపతి నుంచి పోటీ చేయించాలని నాగబాబు ఆలోచిస్తున్నారట. 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు అదే స్థానం నుంచి నాగబాబును పోటీ చేయిస్తే కచ్చితంగా గెలుస్తారని పవన్ అనుకుంటున్నారట. అలాగే ఆయన్ను తిరుపతి నుంచి పోటీ చేయించడం ద్వారా.. రాయలసీమలోని నాలుగు జిల్లాలపై జనసేన ప్రభావం చూపించవచ్చని పవన్ అనుకుంటున్నారట. మరి పవన్ కళ్యాణ్ వ్యూహాలు తిరుపతిలో ఫలిస్తాయా? ఈసారి అయినా నాగబాబు విజయాన్ని దక్కించుకుంటారా? అన్నది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =