సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వైఎస్సార్‌సీపీ నేతల విమర్శలు.. మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Naidu Slashes Out YSRCP Leaders Over Their Comments on Superstar Rajinikanth,TDP Chief Chandrababu Naidu Slashes Out YSRCP Leaders,YSRCP Leaders Over Their Comments,YSRCP Leaders Over Their Comments on Superstar Rajinikanth,TDP Chief Chandrababu Naidu,Mango News,Mango News Telugu,Andhra ministers slam Rajinikanth for praising,Jagan should apologise to Rajinikanth,Kodali Nani Sensational Comments,Tamil superstar Rajinikanth,TDP Chief Chandrababu Naidu Latest News,TDP Chief Chandrababu Naidu Latest Updates,TDP Chief Chandrababu Naidu Live News,Comments on Superstar Rajinikanth Latest News

సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న విమర్శలపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకిలో శుక్రవారం అట్టహాసంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ ఉత్సవాలకు ప్రత్యేక అతిధిగా హాజరైన సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఈ సందర్బంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు మదిలో ఉన్న 2047 విజన్ గురించి తనకు వివరించారని, అది అమలుచేసే అవకాశం వస్తే ఆయన సారథ్యంలో అభివృద్ధిలో ఏపీ ఎక్కడికో వెళ్తుందని పేర్కొన్నారు. దీంతో రజనీకాంత్‌ వ్యాఖ్యలపై వైస్సార్సీపీ నేతలు మంత్రి ఆర్కే రోజా, జోగి రమేష్, మాజీ మంత్రి కొడాలి నాని, లక్ష్మీపార్వతి తదితరులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా దీనిపై స్పందించారు. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై అధికార వైసీపీ నేతలు అసభ్యకర విమర్శల చేస్తున్నారని, వారి తీరు దారుణమని, తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై రజనీకాంత్ ఎలాంటి విమర్శ చేయలేదని, వేదికపై ఆయన ఎవరినీ చిన్న మాట కూడా అనలేదని గుర్తుచేశారు. రజినీ కేవలం తన జీవితంలో జరిగిన ముఖ్యమైన అంశాలపై మాత్రమే తన అభిప్రాయాలు పంచుకున్నారని, అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరని ఆగ్రహించారు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీకాంత్‌ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయని, శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమేనని అన్నారు. తమ పార్టీ నేతలను సీఎం జగన్ అదుపులో పెట్టుకోవాలని, జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలని చంద్రబాబు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =