‘మే డే’ సందర్భంగా.. కార్మిక‌, క‌ర్ష‌కులకు సీఎంలు కేసీఆర్, జగన్ శుభాకాంక్ష‌లు

AP Telangana CMs YS Jagan and KCR Extends Wishes To All The Workers on May Day,AP Telangana CMs YS Jagan and KCR,CMs YS Jagan and KCR Extends Wishes,Wishes To All The Workers on May Day,Mango News,Mango News Telugu,Telangana CM KCR May Day 2023 Greetings,Welfare of workers is goal of our govt,CM KCR extends May Day greetings,Telangana CM KCR's May Day Message,Welfare of Workers is Goal of Our Govt,AP Telangana May Day Wishes,AP CM YS Jagan Mohan Reddy,CM KCR News And Live Updates,Telangana Chief Minister KCR,AP CM Jagan Latest News and Live Updates

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్మికులకు శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ఈ మేరకు వీరిరువురూ ట్విట్టర్ ద్వారా సందేశాలను ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ట్విట్టర్‌లో.. ‘చెమ‌ట చుక్కల‌ను ధార‌పోసి ప‌రోక్షంగా స‌మాజాభివృద్ధికి కృషి చేస్తున్న అంద‌రికీ శుభాకాంక్ష‌లు. త‌ర‌త‌రాలుగా క‌ష్ట‌జీవి శ్ర‌మ‌తోనే ప్ర‌పంచంలో సంప‌ద దృష్టి జ‌రుగుతోంది. మ‌హోన్న‌త‌మైన విశ్వ‌మాన‌వ సౌధానికి శ్ర‌మ‌జీవుల త్యాగాలే పునాదిరాళ్లు’ అని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ‘కార్మిక సోదరులారా.. మీ శ్రమ అమూల్యం. మీరు సేవానిధులు. ఒక దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మీరే కీలకం. నిరంతరం సమాజ హితమే ధ్యేయంగా శ్ర‌మించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు. కార్మికుల సంక్షేమం మన ప్రభుత్వ లక్ష్యం!’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 4 =