జయహో బీసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ

TDP Launched Jayaho BC Programme, Jayaho BC Programme, TDP Jayaho BC Programme, Assembly Elections, TDP Party, Chandra Babu, Lokesh,BC, YCP, TDP Latest BC Programme, DTP BC Programme Update, Andhra Pradesh, AP News, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Assembly elections, TDP party, Chandra Babu , Lokesh,BC ,ycp

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ తెలుగు దేశం పార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది. అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవంతంగా యువుగళం పేరుతో పాదయాత్రను పూర్తి చేశారు. ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ.. కన్నీళ్లు తుడుస్తూ ముందుకు కదిలారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్నారు.

అటు జనవరిలో వరుసగా బహిరంగ సభలు నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో తెలుగు దేశం పార్టీ మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీసీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు జయహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ముందు నుంచి కూడా వైసీపీ పాలనలో బీసీలు అన్యాయమై పోతున్నారని.. వారికి తీరని అన్యాయం జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఆక్రమంలో బీసీ సామాజిక వర్గ ప్రజలను చైతన్య పరిచేందుకు టీడీపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 4 నుంచి జయహో బీసీ కార్యక్రమం మొదలు కాగా.. రెండు నెలల పాటు కొనసాగనుంది.

జయమో బీసీ తొలి విడతలో భాగంగా.. టీడీపీ నేతలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటిస్తారని నారా లోకేష్ వెల్లడించారు. వారు క్షేత్రస్థాయిలో పర్యటించి బీసీలు పడుతున్న కష్టాలు తెలుసుకుంటారన్నారు.  వారి ద్వారా బీసీలు పడుతున్న కష్టాలు తెలుసుకొని.. వారి సమస్యలను నెరవేర్చే విధంగా బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందిస్తామని తెలిపారు. పూర్తిగా బీసీలకు న్యాయం జరిగేలా.. వారికి లబ్ధి చేకూరేలా మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. ఇప్పటికే మినీ మేనిఫెస్టోలో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని ప్రకటించామని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. జగన్ బీసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ తగ్గించి.. 16 వేల మంది బీసీలకు అవకాశాలు లేకుండా చేశారని  చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బీసీల తరుపున పోరాడుతున్న టీడీపీ నేతలపై జగన్ అక్రమ కేసులు పెట్టించి వేధించారని ఆరోపించారు. బీసీలకు లబ్ధి జరిగేలా తమ ప్రభుత్వం పాలన సాగిస్తే.. వైసీపీ మాత్రం అనువనువునా బీసీలకు అన్యాయమే చేస్తోందని మండిపడ్డారు. బీసీలు బలవంతులు కాదు.. బలవంతులన్నదే టీడీపీ నినాదమని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =