టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో జనసేన తీసుకున్న రెండు స్థానాలను కూడా తమ పార్టీ గెలుచుకునే పక్కా వ్యూహంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారా అంటే ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనసేన పోటీ చేయబోతున్న మచిలీపట్నం పార్లమెంటుతో పాటు తాజాగా ప్రకటించిన కాకినాడ పార్లమెంటు స్థానాలు కూడా చాలా బలమైన నియోజకవర్గాలే. సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే మచిలీపట్నం నియోజకవర్గంలో కాపులు ఎక్కువ మంది ఉంటే.. కాకినాడ నియోజకవర్గంలో కాపులు, రెడ్లు కూడా ఎక్కువమందే ఉన్నారు.
ఇలా చూసుకుంటే మచిలీపట్నం, కాకినాడ రెండు నియోజకవర్గాల్లో కూడా పవన్ బలమైన నాయకులకే అవకాశమిచ్చింది. మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎంపీ బాలశౌరి.. అక్కడ తన స్థానాన్నిమార్చడంతో బయటకు వచ్చి జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో బాలశౌరికే తిరిగి మచిలీపట్నం టికెట్‌ను ఎనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. బాలశౌరికి అక్కడ ఉన్న మంచి ఇమేజ్, వైసీపీపై అసంతృప్తి..కాపుల్లో కూడా జనసేనను గెలిపించుకోవాలన్న కసి పెరగడం వంటివి ఈ సారి జనసేనకు బాగా కలిసి రానున్నా యి. వీటికితోడు..వైసీపీలో బాలశౌరికి టికెట్ ఇవ్వలేదన్న ఆవేదన కూడా ఆ నియోజకవర్గ ప్రజలలో కనిపిస్తోంది.
ఇప్పుడు ఈ మూడు విషయాలు కూడా జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరికి ప్లస్ కానున్నాయి. ఇక, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఐదేళ్లూ మచిలీపట్నం హార్బర్ నిర్మాణం కోసం బాలశౌరి బాగానే కష్టపడ్డారు. కేంద్రం నుంచి ఇక్కడికి నిధులు కూడా తీసుకువచ్చారు. అయినా సీఎం జగన్ సీటు ఇవ్వకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఈ అంశం కూడా బాలశౌరికి మరింత కలిసి రానుంది. వైఎస్సార్సీపీ నుంచి కూడా ఇప్పుడు బలమైన అభ్యర్థే ఉండడంతో కొంత ఫైట్ జరిగినా..అంతిమంగా బాలశౌరి వైపే ఓటర్లు ఉన్నారన్న ప్రచారం అక్కడ జరుగుతుంది.
కాకినాడ నియోజకవర్గం విషయం తీసుకుంటే..ఇక్కడ తాజాగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ఉదయ్ పార్లమెంటుకు తొలిసారి పోటీ చేయబోతున్నారు. టీ టైమ్ వ్యాపార వేత్త అయిన ఉదయ్ శ్రీనివాస్.. యువ పారిశ్రామిక వేత్త కావడం, ఆర్థికంగానూ బలంగా ఉండడంతో పాటు, యువతను ఆకర్షించడం వంటి కారణాలు ప్లస్‌గా మారనున్నాయి. పైగా కాకినాడ నియోజకవర్గం పరిధిలోని పిఠాపురం నుంచే జనసేన అధినేత కూడా పోటీ చేయనుండటంతో.. ఇక్కడ జనసేన పాగా వేసే అవకాశం కచ్చితంగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE