ముగిసిన తిరుపతి ఉపఎన్నిక పోలింగ్, 5 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదు

Mango News, Tirupati, Tirupati By Election, Tirupati By Election 2021, Tirupati By Election News, Tirupati By Election Updates, Tirupati By Polls, Tirupati By Polls News, Tirupati Lok Sabha By-election, Tirupati Lok Sabha By-election Polling, Tirupati Lok Sabha By-election Polling Live Updates, Tirupati Lok Sabha By-election Polling News, Tirupati Lok Sabha By-election Polling Updates, Tirupati Lok Sabha Election 2021 Live, Tirupati Lok Sabha Election Result 2021 Live

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే పూర్తిస్థాయి పోలింగ్ శాతం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితం వెల్లడించనున్నారు.

5 గంటల వరకు పోలింగ్ వివరాలు:

  • సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 57.91 శాతం
  • సూళ్లూరుపేటలో 60.11
  • వెంకటగిరిలో 55.88
  • గూడూరులో 51.82
  • సత్యవేడులో 58.45
  • తిరుపతిలో 45.84
  • శ్రీకాళహస్తిలో 57 శాతం

 

–> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 2470 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో శానిటైజర్స్, మాస్కులు, పీపీఈ కిట్లు సహా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నిక పక్రియను సచివాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉపఎన్నికలో 17,11,195 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఉదయం 9 గంటల వరకు 7.8% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

–> తిరుపతి పోరులో 28 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థిగా ఎం.గురుమూర్తి, టీడీపీ తరుపున పనబాక లక్ష్మీ, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ అధికారిని రత్నప్రభ ఈ ఉపఎన్నికల్లో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీల కీలక నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఈ ఉపఎన్నికపై ప్రజల్లో ఆసక్తి నెలకుంది. ఇక మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాన్ని వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − seven =