ఒక్కో డోసు ధర రూ.250, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరపై కేంద్రం నిర్ణయం

Centre Orders to Charge up to Rs 250 per Person Per Dose, Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid Vaccination Cost, Covid vaccination in India, Covid Vaccination in Private Hospitals, Covid Vaccination Price, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Mango News

దేశంలో రెండోదశ కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా మార్చి 1 వ తేదీ నుండి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్‌ వేయనున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 10,000 ప్రభుత్వ కేంద్రాల్లో, మరో 20,000 ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వబడుతుందని, అయితే ప్రైవేట్ ఆసుపత్రుల నుండి వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు ధర చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కో-విన్‌ 2.0 సాఫ్ట్‌వేర్ ‌పై శిక్షణ కార్యక్రమం సందర్భంగా వ్యాక్సిన్ పంపిణీకి నిర్ణయించిన ధరను రాష్ట్రాలకు కేంద్రం వెల్లడించింది. ఒక్కో వ్యక్తికీ ఒక్కో డోసుకు ధరను రూ.250గా నిర్ణయించారు. ఇందులో సర్వీస్‌ ఛార్జిగా రూ.100, వ్యాక్సిన్‌ డోసు ధరను రూ.150 గా ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో డోసుకు రూ.250 చొప్పున రెండు డోసుల కరోనా వాక్సిన్ 500 రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి రానుంది.

అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ధరనే వసూలు చేసేలా చూడాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీలో కీలకంగా ఉపయోగిస్తున్న కో-విన్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ను కో-విన్‌ 1.0 నుంచి కో-విన్‌ 2.0కు ఆధునీకరిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 27, శనివారం మరియు ఫిబ్రవరి 28, ఆదివారం నాడు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =