ఆ విషయంలో వారిని ఫాలో అవుతోన్న చిరు

Megastar Chiranjeevi Is Walking In The Footsteps Of Rajinikanth And Kamal Haasan,Megastar Chiranjeevi,Chiranjeevi Is Walking In The Footsteps Of Rajinikanth,Chiranjeevi In The Footsteps Of Rajinikanth,Footsteps Of Rajinikanth And Kamal Haasan,Chiranjeevi In The Footsteps Of Rajinikanth And Kamal Haasan,Mango News,Mango News Telugu,Chiranjeevi, Mega 157 ,Kamal Haasan,Rajinikanth,Megastar Chiranjeevi, Rajinikanth And Kamal Haasan,Megastar Chiranjeevi Latest News,Megastar Chiranjeevi Latest Updates

మెగాస్టార్ చిరంజీవి అంటేనే సినీ ఇండస్ట్రీలో ఓ మహా వృక్షం. సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎవరో ఒకరి సహాయం ఉండాలనే మాట..స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి ముందు చిన్నబోయింది. అందుకే చిరు అంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారికి ఓ రోల్ మోడల్. సత్తా ఉంటే ఎవడైనా దునియాను దున్నేయొచ్చున్న నమ్మకాన్ని టన్నులు టన్నులు ఇచ్చిన మెగా శక్తి. అందుకే చిరంజీవికి సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఎంత పెద్ద డైరెక్టర్లు అయినా వాళ్ల జీవిత కాలంలో ఒక్కసారయినా చిరంజీవితో సినిమా చేయాలని ఎదురు చూస్తుంటారు.

అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో బాక్సాఫీసు కలెక్షన్స్ కొల్లగొట్టిన బాస్.. తర్వాత వచ్చిన ఆచార్య, భోళా శంకర్ సినిమాలతో ప్లాప్ టాక్‌ను మోయాల్సి వచ్చింది. దీనికి రీమేక్ సినిమాలే కారణమని ఫ్యాన్స్, క్రిటిక్స్ పెద్ద ఎత్తున గోల చేస్తున్నారు. పక్కా స్ట్రెయిట్ సినిమాతో అభిమానులను అలరించాల్సిన మెగా స్టార్..స్టోరీలే లేనట్లు రీమేక్ సినిమా కథలమీద ఆధారపడటం ఏంటని గగ్గోలు పెడుతున్నారు. దానికి తోడు చిరు ఏజ్ ఏంటో అందరికీ తెలుసు. వయస్సుకు తగ్గట్టు బిగ్ బీ, కమల్ హాసన్, రజనీకాంత్ చేస్తున్నట్లుగా డీసెంట్ క్యారెక్టర్ చేయొచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటివారందరికీ చిరు తన నెక్ట్స్ సినిమాతో సమాధానం చెబుతున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్‌లో చిరంజీవి 157 వ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ చూపంతా దాని మీదే ఉంది. దానికి తగినట్లే వశిష్ట కూడా చిరు కెరీర్లో ఇది చాలా కొత్తగా ఉండబోతుందని చెప్పి ఫ్యాన్స్ అంచనాలను ఓ రేంజ్‌లో పెంచేశారు.దీనిలో చిరంజీవి ఒక మెచ్యూర్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జైలర్ సినిమాలో రజనీకాంత్ కనిపించినట్లుగా,విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ కనిపించినట్టుగా ..చిరు కొత్త రోల్‌లో కనిపించబోతున్నారట.

ఇప్పటికే చిరంజీవి సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ సైడయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా హీరోయిన్స్ ఉండరు. డ్యూయెట్ సాంగ్స్ కూడా ఉండవు. కేవలం కథ మీద బేస్ చేసుకుని మాత్రమే సినిమా నడుస్తూ ఉండే క్యారెక్టర్లో చిరు కనిపిస్తారు. ఇప్పటి వరకూ ఇలాంటి సినిమాలు తమిళ్ , మలయాళంలో చాలామంది హీరోలు చేశారు చేస్తున్నారు.కానీ ఇది చిరంజీవికి మాత్రం కొత్త అనే చెప్పాలి. దీంతో చిరు సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఇప్పటి వరకూ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అదే చిరంజీవి, వశిష్ట ఇస్తున్నారన్న టాక్ నడస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =