రౌడీ హీరో నయా రికార్డ్

Vijay Devarakondas Whatsapp Channel Record,Vijay Devarakondas Whatsapp,Vijay Whatsapp Channel,Devarakonda Channel Record,Mango News,Mango News Telugu,Vijay Deverakonda,Vijay Devarakondas Whatsapp Channel Record, Whatsapp Channel Record, Whatsapp,Vijay Devarakonda About His Whatsapp Channel,Vijay Devarakonda Latest News,Vijay Devarakonda Latest Updates,Vijay Devarakonda Live News,Actor Vijay Devarakonda Latest News,Vijay Devarakonda Whatsapp Latest Updates

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వయంకృషితో టాలీవుడ్‌లో కొంచెం కొంచెం ఎదిగిన ఈ యంగ్ హీరోకు అర్జున్ రెడ్డి సినిమా టర్నింగ్ పాయింట్ ఇవ్వడంతో ఓవర్ నైట్‌లోనే స్టార్ హీరో స్టేటస్ సంపాదించాడు.

అర్జున్ రెడ్డి మూవీతో వరుస ఆఫర్లు అందుకున్న విజయ్ దేవరకొండ ..ఆ తర్వాత కొన్ని విజయాలు అందుకున్నా.. కొంత కాలం నుంచి డౌన్ ఫాల్ స్టార్టవడంతో అప్పటి జోష్ కనిపించడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్.. బాక్సాఫీసు వద్ద బోర్లా పడటంతో మరీ డిజప్పాయింట్ అయ్యాడు. అయితే రీసెంటుగా సమంతాతో కలిసి.. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా హిట్ టాక్ ఇవ్వడంతో..కాస్త మునుపటి జోష్ వచ్చినట్లు అయింది. ప్రేమ కథగా వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో..విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్‌కు ఈ మధ్య సర్ఫ్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు.

తన రెమ్యునరేషన్‌లో కోటి రూపాయల అభిమానులకు పంచబోతున్నట్లు చెప్పడమే కాదు.. చెప్పినట్లుగా రౌడీ హీరో ఫ్యాన్స్ అయిన 100 కుటుంబాలకు .. ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు అందించారు. అంతేకాదు.. తను కెరియర్ పరంగా ఎంత డౌన్ ఫాల్ చూసినా కూడా అప్పుడు, ఇప్పుడు కూడా తనకి అండగా.. ఉన్నది అభిమానులేనంటూ ఖుషి సక్సెస్ మీట్‌లో చెప్పడంతో విజయ్ దేవరకొండకు మరింత ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఏ యాటిట్యూడ్‌ను తిట్టి అతన్ని దూరంగా పెట్టారో.. అదే యాటిట్యూడ్‌తో మరింత మందిని ఫ్యాన్స్‌ను పెంచుకున్నాడు విజయ్ దేవరకొండ.

ఈ రకంగా అభిమానులకు దగ్గరవుతున్న విజయ్ దేవరకొండ.. తాజాగా వాట్సాప్‌లో రికార్డు సృష్టించడంతో రౌడీ హీరో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ పేరుతో ఓ వాట్సాప్ చానల్ స్టార్ట్ చేశాడు.వాట్సాప్ చానల్‌లో ఉన్న ఫీచర్ తో యూజర్లు తమ కంటెంట్‌ను ఫోటో, వీడియోలు, స్టిక్కర్స్ ,పోల్స్ లేదా టెక్స్ట్ రూపంలో పంపించవచ్చు. ఈ చానల్‌లో అడ్మిన్ తప్ప వేరేవాళ్లు చాటింగ్ చేయడం, ఎమోజీలు పంపడం వంటి ఎలాంటి సదుపాయాలు ఉండవు. కాకపోతే అడ్మిన్ పంపిన ఫోటోలకు, మెసేజులకు లైక్, సూపర్ వంటి వంటి ఎమోజీలతో మన ఎక్స్‌ప్రెషన్ చెప్పొచ్చు.

దీంతో చాలామంది హీరోలు, సెలబ్రిటీలు, కొన్ని కొన్ని మీడియా చానల్స్ సైతం.. వాట్సాప్ చానల్స్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు.ఇలాగే విజయ్ దేవరకొండ కూడా వాట్సాప్ చానల్ క్రియేట్ చేసుకోవడంతో.. అతి తక్కువ కాలంలోనే వన్ మిలియన్‌కి పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఎంత స్పీడ్ రెస్పాన్స్ తెలుగులో ఇప్పటి వరకూ వాట్సాప్ చానల్‌లోకి ఎంటరయిన ఏ హీరోకి కూడా దక్కలేదు. అయితే ఇప్పుడు వాట్సాప్ చానల్‌లోనే కాదు..గతంలో సోషల్ మీడియాలో ఇతర విభాగాలలో విజయ్ ఎంటరయినపుడు కూడా అతి తక్కువ టైంలోనే ఎక్కువ ఫాలోవర్స్ విజయ్ దేవరకొండ సంపాదించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =