ఈవీలకు కొత్త రూట్..

New route for EVs Centers special focus on electric roads,New route for EVs Centers,EVs Centers special focus,special focus on electric roads,Mango News,Mango News Telugu,Electrified Road For Charging Vehicles,First Electrified Roads,Electrified Vehicle, Electric Vehicle,Power transmission system , New route for EVs, focus on electric roads,Electric roads Latest News,Electric roads Latest Updates,Electric roads Live News,EVs Centers special focus Latest News,New route for EVs Latest News

రోడ్డు రవాణా వ్యవస్థ ముఖ్యంగా డీజిల్‌,పెట్రోల్‌పైనే ఆధారపడుతోందన్న విషయం తెలిసిందే. వీటి దిగుమతి కోసమే భారతదేశం భారీ ఎత్తున ఖర్చు పెట్టల్సి వస్తోంది.
మరోవైపు చమురును ఎక్కువగా వినియోగించడం వల్ల వాయుకాలుష్యం కూడా పెరుగుతోంది. ఇలాంటి సమస్యలకు ఎలక్ట్రిక్ వెహికల్సే పరిష్కారం కావడంతో అధికారులు వీటి కోసం అత్యాధునిక విద్యుత్‌ రోడ్లపై దృష్టి సారిస్తున్నారు.

ఎందుకంటే ఈవీలు ఖరీదు ఎక్కువగా ఉండటం, పైగా లాంగ్ జర్నీలకు అనుకూలంగా లేకపోవడం, సరిపడా ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు,ఒకవేళ ఎక్కడయినా ఉన్నా ప్రయాణం మధ్యలో ఛార్జింగ్‌ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావడం వంటి సమస్యలు.. విద్యుత్‌ వెహికల్స్‌ వాడకాన్ని తగ్గించేలా కనిపిస్తున్నాయి. దీనికి తోడు బ్యాటరీలు కూడా మెయిన్ సమస్యగా మారుతున్నాయి. బ్యాటరీల ఖరీదు ఎక్కువ అనుకుంటే దానికి తోడు బరువు వంటి కారణాలతో భారీ వాహనాలకు ఉపయోగించడం లేదు. కేవలం ఈవీలు అంటే తేలికపాటి వస్తువుల రవాణాకు మాత్రమే స్టాంప్ వేసుకుంది.

బ్యాటరీ తయారీలో ఉపయోగించే లిథియం, నికెల్‌, మాంగనీస్‌ వంటివి ఇండియాలో దొరకడం కూడా తక్కవే. దీనివల్లే పెట్రోల్ దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడినట్లుగానే ఈ ముడిసరకుల కోసం కూడా వీటిపై ఆధారపడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి విద్యుత్ రోడ్లు మాత్రమే పరిష్కారంగా కేంద్రం ముందు కనిపిస్తుంది.

కరెంటుతో నడిచే వెహికల్స్‌కు రోడ్డు పొడవునా నిరంతర విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలని ఇప్పటికే నిపుణులు సూచించారు. దీని కోసం రైల్వేమార్గం లాగే.. భూఉపరితలంపై కొంత ఎత్తున పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం ఒక పద్ధతి. ఇంకో పద్ధతిలో భూమిపై రైలు పట్టాలలాగూ విద్యుత్‌ ప్రసార లైన్లు నెలకొల్పడం. ఈ రెండు పద్ధతుల్లోనూ కరెంటును నేరుగా అనుసంధాన పద్ధతిలో వెహికల్‌లోని మోటారుకు అందించొచ్చు.

ఇవికాకుండా, అండర్ గ్రౌండ్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి డైరక్ట్ కనెక్షన్ లేని ఇండక్షన్‌ పద్ధతిలో రోడ్డుపై ప్రయాణించే వెహికల్స్‌కు కరెంటు సప్లై చేయొచ్చు. రైల్వేల లాగే రహదారులపై కరెంటు లైన్లు ఏర్పాటు చేసే ఈ పద్ధతిలో..వెహికల్స్ పైన అమర్చే ప్రత్యేక గ్రాహకాలు తీగల్ని తాకుతూ విద్యుత్‌ను తీసుకుంటూ నడుస్తాయి. సాంకేతికంగా చూసుకున్నా.. నిర్వహణపరంగా చూసుకున్నా కూడా ఇవి చాలా అనుకూలమైనవి. కాకపోతే, వీటిని రోడ్డుపై కొంత ఎత్తులో నిర్మించాల్సి ఉంటుంది.

భూమిపై రైలు పట్టాలలాగ వేసే కరెంట్ లైన్లు అన్ని రకాల వెహికల్స్‌కు అనుకూలంగా ఉంటాయి. అండర్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే విద్యుత్‌ వ్యవస్థలో ఉపరితలంపై స్తంభాలు, తీగలు ఏర్పాటు చేయవలసిన అవసరముండదు. కానీ ఈ పద్ధతిలో కొన్ని సాంకేతిక లిమిట్స్ వల్ల పెద్దమొత్తంలో విద్యుత్‌ను అందించలేవు. భారీ వాహనాలకు కూడా ఇది అనుకూలం కాదని నిపుణులు చెబుతున్నారు.

రోడ్డు వెంబడి కరెంట్ సౌకర్యం ఏర్పాటుకు ఎత్తులో ఉండే ఉపరితల వ్యవస్థకు కి.మీటర్‌కు దాదాపు రూ.9.30 కోట్లు, భూమిపై రైలు పట్టాలలాగా ఏర్పాటు చేసే లైన్లకు దాదాపు రూ.5.84 కోట్లు, భూగర్భ వ్యవస్థకు దాదాపు రూ.18.33 కోట్లు ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోడ్డు ఎలక్ట్రిక్ సిస్టమ్‌ల జీవితకాలం ఇరవైఏళ్లకు పైనే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి మార్గాల్లో వెహికల్స్ వెళుతున్నప్పుడు ..వాటిలో చిన్న బ్యాటరీ ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా జర్నీ చేయొచ్చు. మధ్యలో పవర్ సప్లైకు అంతరాయం ఏర్పడినా సమస్య ఉండదు. లైన్ల ఏర్పాటు లేకపోయినా కొంతదూరం ప్రయాణించగలవు. కాకపోతే విద్యుత్‌ రోడ్లపై నడిచే వాహనాలకు తయారీలోనే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే కేంద్ర నేషనల్ హైవే శాఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్నిఈజీ చేసే ప్రయత్నంలో భాగంగా.. ‘విద్యుత్‌ వాహనాల కోసం జాతీయ రహదారులు’ అనే పేరుతో తొలిసారిగా నాగ్‌పుర్‌లో పైలట్‌ ప్రాజెక్టు నిర్మించింది. ఇదే ఊపుతో ఢిల్లీ ,ముంబయి మధ్య ఎలక్ట్రిక్ రోడ్డును అందుబాటులోకి తీసుకురానుంది. రాబోయే కాలంలో అయిదు వేల కిలోమీటర్ల ఎలక్ట్రిక్ నేషనల్ హైవేలను నిర్మించాలని ఆలోచిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =