ఇండియా ఓపెన్ టోర్నమెంట్ – కిడాంబి శ్రీకాంత్ సహా 7గురికి కరోనా

2022 India Open Tournament, 7 Indian Shuttlers Tested Positive for Covid-19, 7 Indian Shuttlers Tested Positive for Covid-19 in India Open Tournament, COVID-19 hits tournament, India Open, India Open 2022, India Open Badminton, India Open Tournament, India Open Tournament 2022, Kidambi Srikanth among 7 Indians to test positive, Kidambi Srikanth Among Seven Indians, Mango News, Seven shuttlers test Covid+, Srikanth six other players withdrawn after testing positive, Top shuttlers Kidambi Srikanth and Ashwini Ponappa

ఇటీవల ప్రారంభమైన ఇండియా ఓపెన్ టోర్నమెంట్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ సహా.. మరో 6గురు ప్లేయర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇండియా ఓపెన్ టోర్నమెంట్ లో 7గురు షట్లర్లు కరోనా బారిన పడినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ప్రకటించింది. వీరిలో కిడాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, కుషి గుప్తా, మిథున్ మంజునాథ్, ట్రెస్సా జోలీ, రితికా రాహుల్, సిమ్రన్ అమాన్ సింఘి ఉన్నారు. దీనికారణంగా.. ఈ క్రీడాకారుల డబుల్స్ పార్ట్నర్స్ కూడా టోర్నీ నుంచి వైదొలిగారని బిడబ్ల్యూఎఫ్ ప్రకటించింది.

అయితే, కరోనా కారణంగా వైదొలిగిన ఆటగాళ్ల స్థానంలో కొత్తవారిని తీసుకోవడం లేదని సమాఖ్య తెలిపింది. దీంతో.. వారి ప్రత్యర్థులని నేరుగా తదుపరి రౌండ్లకు ప్రమోట్ చేస్తామని తెలియజేసింది. దీనిని బ్యాడ్మింటన్ అసోసియేషన్ అఫ్ ఇండియా కూడా ధృవీకరించింది. కాగా, జనవరి 11న మొదలైన ఈ మెగా టోర్నీలో ఇప్పటికే పలువురు విదేశీ ప్లేయర్లు కూడా కరోనా బారినపడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. తాజాగా.. మరో 7గురు ప్లేయర్లు కరోనా బారినపడటంతో టోర్నీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + ten =