28 ఏళ్ల తర్వాత అరుదైన ఆతిథ్యం

After 28 Years Miss World Pageants In India,After 28 Years,Miss World Pageants In India,Miss World In India,Miss World Pageant,Empowerment, Miss World Pageants In India,Hospitality After 28 Years, Aishwarya Rai, Diana Hayden , Yuktamukhi , Priyanka Chopra, Manushi Chillar,Mango News,Mango News Telugu,Miss World Pageants Latest News,Miss World Pageants Live Updates
Miss World Pageant,empowerment, Miss World pageants in India,hospitality after 28 years, Aishwarya Rai, Diana Hayden , Yuktamukhi , Priyanka Chopra, Manushi Chillar

28 ఏళ్ల తర్వాత  ‘మిస్ వరల్డ్‘ పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోన్న వార్త ఇప్పుడు అందరిలో జోష్‌ను నింపుతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు  మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వాహకులు అనౌన్స్ చేశారు.

మిస్ వరల్డ్‌ పోటీలకుకు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు గర్వంతో కూడిన ఉత్సాహాన్ని నింపుతుందని.. మిస్ వరల్డ్ అధికారిక ఎక్స్ ప్లాట్ ఫారమ్ అకౌంట్లో..  మిస్ వరల్డ్ చైర్మన్ జూలియా మోర్లీని మెన్షన్ చేస్తూ ట్వీట్ చేసింది.  అందం, వైవిధ్యం, ఎంపవర్మెంట్ యొక్క ఈ  వేడుక అందరి కోసం వేచి ఉందని.. అద్భుత ప్రయాణానికి అంతా  సిద్ధంగా ఉండండని పేర్కొంది. హ్యాష్ ట్యాగ్ . మిస్ వరల్డ్ ఇండియా  హ్యాష్ ట్యాగ్ బ్యూటీ విత్ పర్పస్” అంటూ ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు.

భారతదేశంలో  1996లో చివరి సారిగా బెంగళూర్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. అలాగే 1966లో తొలిసారిగా భారత్ తరపున రీటా ఫారియా పావెల్  మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1994 వసంవత్సరంలో ఐశ్వర్యరాయ్, 1997 సంవత్సరంలో డయానా హెడెన్, 1999 సంవత్సరంలో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంకా చోప్రా, 2017 లో మానుషి చిల్లర్ ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.

గత ఏడాది జరిగిన  మిస్ వరల్డ్ పోటీల్లో పోలాండ్‌కి చెందిన కరోలినా బిలావ్క్సా అందాల రాణిగా నిలిచారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 మధ్య మిస్ వరల్డ్ ఈవెంట్ భారతదేశంలోనే  నిర్వహించనున్నారు. మిస్ ఇండియా ఓపెనింగ్ సెర్మనీ ‘ఇండియా వెల్కమ్ ది వరల్డ్ గాలా’ పేరుతో.. ఐటీడీసీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ అశోక హోటల్‌లో నిర్వహించనున్నారు.  ఫైనల్స్‌ మాత్రం మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 3 =