భారత దేశంలో చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది?

At what time does lunar eclipse occur in India,At what time does lunar eclipse occur,lunar eclipse occur in India,Mango News,Mango News Telugu,Lunar Eclipse,alignment,miracle in the sky, lunar eclipse occur, India,Lunar eclipse 2023,Chandra Grahan today,Lunar eclipse Latest News,India Lunar eclipse Latest Updates,India Lunar eclipse Live News,Lunar eclipse 2023 Latest News
Lunar Eclipse,alignment,miracle in the sky, lunar eclipse occur, India

ఖగోళ అద్భుతాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే  ఈ  ఖగోళ అద్భుతాలుగా చెప్పుకునే గ్రహణాలు ఏర్పడినప్పుడు మనిషి భూమి మీద ఉండి కూడా వీక్షించగలడు. సూర్యుడు, చంద్రుడి మధ్యకు భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రునిపై నీడ వేయడాన్నే  చంద్రగ్రహణం అంటారు. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు అలైన్మెంట్‌లో ఉన్నప్పుడు పౌర్ణమి సమయంలో మాత్రమే  గ్రహణం ఏర్పడుతుంది.

గ్రహణ సమయంలో సూర్యరశ్మిని చంద్రునికి చేరకుండా భూమి అడ్డుకుంటుంది. దీని వల్ల అది ఎరుపు-గోధుమ లేదా నారింజ రంగులో కనిపిస్తుంది. ఈ నెల ప్రారంభంలో వచ్చిన సూర్యగ్రహణాన్ని చాలా మంది చూసి ఆనందించారు. అయితే ఈ వారంలో ఏర్పడనున్న పాక్షిక చంద్రగ్రహణం కోసం ఆత్రుతగా ఖగోళ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం మే 5న  చంద్రగ్రహణం ఏర్పడింది. దాని తర్వాత మరోసారి చంద్రగ్రహణం ఏర్పడుతుంది.కానీ ఇది కేవలం పాక్షిక చంద్ర గ్రహణం మాత్రమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చంద్ర గ్రహణాలు వేల సంవత్సరాలుగా మానవులకు ఖగోళ అద్భుతాలుగా నిలుస్తున్నాయి. అయితే అనేక సంస్కృతుల్లో చంద్ర గ్రహణాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో ముడిపడి ఉన్నట్లు పెద్దలు చెబుతూ ఉంటారు. నేటి కాలంలో భూమి, చంద్ర వ్యవస్థ,  భూమికి సంబంధించిన వాతావరణానికి సంబంధించిన ప్రభావం గురించి మరింత బాగా అర్థం చేసుకోవడానికి గ్రహణాలు ఖగోళ శాస్త్రవేత్తలకు బాగా ఉపయోగపడుతాయి. ప్రస్తుతం  చంద్రగ్రహణాలను శాస్త్రవేత్తలు మూడు రకాలుగా విభజించారు. ఒకటి సంపూర్ణ చంద్ర గ్రహణం, రెండూ పాక్షిక చంద్ర గ్రహణం, మూడు పెనుంబ్రల్ చంద్ర గ్రహణం.అయితే ఈ అక్టోబర్‌ 28న భూమికి సంబంధించిన నీడ మీదుగా పాక్షికంగా చంద్రుడు వెళ్తున్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో చంద్రుడు ఎరుపు,గోధుమ కలిసిన రంగులోకి మారతాడు.

భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం అక్టోబర్ 28, 2023న రాత్రి 11గంటల 31 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. తిరిగి ఈ చంద్ర గ్రహణం అక్టోబర్‌ 29న ఉదయం మూడు గంటల 36 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహణాన్ని అర్ధరాత్రి ఒంటి గంట 6 నిమిషాల నుంచి 2 గంటల 23 నిమిషాల మధ్యలో వీక్షించవచ్చు. అమెరికా, యూరప్,  ఆసియా, రష్యా, ఆఫ్రికా, అంటార్కిటికాతో సహా చంద్రుడు హోరిజోన్‌కు ఎగువన ఉన్న చోట నుంచి ఈ  పాక్షిక గ్రహణాన్ని వీక్షించవచ్చు. గ్రహణం సమయంలో చంద్రుడు హోరిజోన్ నుంచి 62 డిగ్రీల ఎత్తులో ఉంటాడు. భారతదేశంలో ఈ  గరిష్ట గ్రహణం ఉదయం 1:45 గంటలకు ఏర్పడుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + fifteen =