50 లక్షల మార్కును క్రాస్ చేసిన భక్తుల సంఖ్య

Record breaking Chardham Yatra,Record breaking,Chardham Yatra,Chardham Yatra Record,Mango News,Mango News Telugu,Char Dham yatra,Record breaking, Chardham Yatra, Number of devotees, 50 lakh devotees,Record 45 lakh pilgrims make it to Char Dham yatra,Record broken in Chardham Yatra,Char Dham yatra Latest News,Char Dham yatra Latest Updates,Char Dham yatra Live News
Char Dham yatra,Record breaking, Chardham Yatra, Number of devotees, 50 lakh devotees,

ఈసారి చార్‌ధామ్ యాత్రలో భక్తులు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఏడాది చార్ ధామ్‌ను సందర్శించిన భక్తుల సంఖ్య..ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న వారి సంఖ్య 50 లక్షల మార్కును దాటిందని అధికారులు చెబుతున్నారు. చార్‌ధామ్ యాత్రను సందర్శించే భక్తుల సంఖ్య పెరగడం వెనుక పరిస్థితులు అనుకూలించడమే కారణమని అధికారులు అంటున్నారు. భక్తుల సంఖ్య పెరగడానికి వాతావరణం, రోడ్డు నిర్వహణ, సీఎం పుష్కర్ సింగ్ ధామి సమర్థ నిర్వహణను చూపిస్తుందని చెబుతున్నారు. డిసెంబర్‌లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు ముందు తేలిన ఈ గణాంకాలు.. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టే చాలా మంది పెట్టుబడిదారులను కచ్చితంగా ఆకట్టుకోనున్నాయి.

3 సంవత్సరాల నుంచి పెరిగిన  భక్తుల సంఖ్య చూసుకుంటే.. 2021లో కరోనా అంతరాయం కలిగించడంతో 5.18 లక్షల మంది చార్ ధామ్ యాత్రకు వెళ్లారు . అలాగే  2022లో 46.27 లక్షలు మంది.. ఈ సారి ఏకంగా 2023లో 50.12 లక్షలు మంది చార్ ధామ్ యాత్రకు వెళ్లారు. 27 డిసెంబర్ 2016న, ప్రధాన మంత్రి మోడీ ఉత్తరాఖండ్‌లో ఆల్-వెదర్ రోడ్‌కు శంకుస్థాపన  చేసి  మెరుగైన కనెక్టివిటీకి ఒక ముఖ్యమైన అడుగు వేశారు. గంగోత్రి,యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు అన్ని వాతావరణ కనెక్టివిటీని మెరుగుపరచడమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రాథమిక లక్ష్యమని అధికారులు గుర్తు చేస్తున్నారు.

ఈ కనెక్టివిటీ వల్ల చార్ ధామ్ యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణాను అధికారులు అందించారు.  వాతావరణ పరిస్థితులు, సహజమైన అడ్డంకులు లేకుండా వారి ప్రయాణాన్ని చేపట్టేందుకు వీలు కల్పించడానికి  వీలుగా  మారింది. ఈ పర్మినెంట్ రోడ్డు ప్రాజెక్ట్ పూర్తి చేయడం వల్ల  ఆ ప్రాంతవాసులతో పాటు  అక్కడి నివసించేవారికి  ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇది  పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ ప్రాంతంలో వాణిజ్యాన్ని కూడా పెరిగేలా చేసి  ఉత్తరాఖండ్ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.

సీఎం పుష్కర్ సింగ్ ధామి యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఎన్నో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నుంచి చార్ ధామ్‌లలో భక్తులకు దర్శనం వరకు వివిధ రకాల ఏర్పాట్లు ఉన్నాయి. యాత్ర మధ్యలో భక్తులు అనారోగ్యం పాలయినా.. అనుకోని ప్రమాదాలు జరిగినా వారి కోసం అధునాతన అంబులెన్స్‌లు కూడా పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచారు.అంతేకాదు వారి కోసం ప్రత్యేక డాక్టర్ల బృందం ఏర్పాటు చేయడంతో యాత్రకు వచ్చే భక్తులకు ఇది చాలా సౌకర్యవంతంగా మారింది. ఇలా యాత్రికులకు టెలిమెడిసిన్ సేవలను అందించే చార్ ధామ్ తీర్థయాత్రల వద్ద 50  వరకూ ఆరోగ్య  ఏటీఎంలను కూడా ఏర్పాటు చేశారు. దీంతోనే రికార్డు స్జాయిలో  భక్తులు వచ్చారు. ఇలాగే  వచ్చే ఏడాది కూడా రికార్డులు బద్దలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 13 =