కేంద్రం కీలక నిర్ణయం.. జాతీయ ఆహార భద్రత పథకం కింద 81.35 కోట్ల మందికి ఏడాదిపాటు ఉచితంగా ఆహారధాన్యాలు

Central Govt Provide Food Grain Free of Cost For 81.35 Cr Beneficiaries, NFSA For 1 Year, Mango News, Mango News Telugu, Central Govt Provide Food Grain Free, Free Food Grain For 81.35 Cr Beneficiaries, Free foodgrains to 81.35 crore beneficiaries, National Food Security Act for one free food, Govt makes foodgrain free of cost, Centre makes ration free for 1 year, Free Ration Scheme

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద జనవరి 1, 2023 నుంచి ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, ఆహార మరియు ప్రజాపంపిణీ, వాణిజ్యం, పరిశ్రమలు మరియు జౌళి శాఖ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి పీయూష్ గోయల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) పరిధిలోని లబ్ధిదారులకు ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించాలని కేంద్రం నిర్ణయించిందని, తద్వారా దేశవ్యాప్తంగా 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనుందని తెలిపారు.

ఇక ముతక తృణధాన్యాలకు రూ.1, గోధుమలకు రూ.2 మరియు కిలో బియ్యానికి రూ.3 చొప్పున చెల్లించే లబ్ధిదారుల కుటుంబాలు ఇప్పుడు వచ్చే ఏడాదికి 35 కిలోల ఆహారధాన్యాలను ఉచితంగా పొందనున్నాయని వెల్లడించారు. అలాగే ప్రాధాన్యతా గృహాల (పిహెచ్‌హెచ్) లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల ఆహార ధాన్యాలు, అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) లబ్ధిదారులకు (పేద పేదలకు) ప్రతి ఇంటికి 35 కిలోల ఆహార ధాన్యాలు వచ్చే ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ పథకం కోసం కేంద్రం అదనంగా రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తోందని కూడా ఆయన తెలిపారు. ఇక ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం మేరకు ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ కింద 28 నెలల పాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ జరిగిందని కూడా ఆయన తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − three =