ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌ అరెస్ట్, కోర్టులో హాజరుపరిచిన సీబీఐ

ICICI Bank Ex-CEO Chanda Kochhar Detained By CBI, Produced Before Special Mumbai Court and Seeks 3-day Custody, Mango News, Mango News Telugu, ICICI Bank Ex-CEO Chanda Kochhar, ICICI Bank Ex-CEO, Videocon loan fraud case, Chanda Kochhar in ICICI loan fraud case, Former ICICI Bank CEO Chanda Kochhar, Mumbai News Updates, CBI seeks 3-day custody of ex-ICICI Bank CEO, Loan fraud case

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ ను శుక్రవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు శనివారం చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్‌ లను ముంబయి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారికీ సంబంధించి మూడు రోజుల కస్టడీని సీబీఐ కోరింది. వారిద్దరికీ సెక్షన్ 41 సీఆర్పీసీ నోటీసు ఇచ్చామని, విచారణకు సహకరించని నేపథ్యంలోనే వారిని అరెస్టు చేసినట్టుగా సీబీఐ కోర్టుకు తెలిపింది.

ముందుగా 2012లో వీడియోకాన్‌ గ్రూపుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ మంజూరు చేసిన రుణాల్లో మోసం, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై చందా కొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌లను సీబీఐ అధికారులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. వీడియోకాన్ గ్రూప్ కు ఐసీఐసీఐ బ్యాంక్ నుండి 3,250 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసిన అంశంలో, బ్యాంకును మోసం చేసేందుకు ఇతరులతో కలిసి ప్రైవేట్ కంపెనీలకు కొన్ని రుణాలు మంజూరు చేశారనే ఆరోపణలపై నేరపూరిత కుట్రకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద మరియు అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద చందా కొచ్చర్, దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్ ధూత్‌, కొన్ని కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం వారిని సీబీఐ అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 3 =