భారత్‌లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,178 కేసులు

Corona Updates India Reports 7178 New Covid-19 Infections in Last 24 Hrs Active Cases Dip To 65683,Corona Updates,India Reports 7178 New Covid-19 Infections,Covid-19 Infections in Last 24 Hrs,Covid-19 Active Cases Dip To 65683,Mango News,Mango News Telugu,India logs 7178 new COVID-19 cases,Covid-19 live updates,India Witness Slight Dip Again,India Logs 7178 New COVID-19 Cases,India sees a dip in daily Covid-19 cases,Covid-19 Cases On April 24,Covid News Live Updates,Coronavirus in India Live Updates,India Records 10753 Fresh Covid Cases,Indias Active COVID-19 Cases Exceed,Corona India,Information About COVID-19,India Covid Last 24 Hours Report,Active Corona Cases,Corona Active Cases Exceeds,MoHFW,India Fights Corona,Coronavirus Statistics

భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. అయితే తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు 7వేలకు లోపే నమోదవడం కొంత ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన రెండు వారాలుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కరోనా కేసులు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన అప్‌డేట్‌ ప్రకారం.. గత 24 గంటల్లో (ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు) మొత్తం 78,342 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 7,178 కొత్త కోవిడ్-19 పాజిటివ్‌లు వెలుగుచూశాయి. తద్వారా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 65,683గా ఉంది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 4,48,98,893కి చేరినట్లయింది. ఇక 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా 16 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,31,345కి చేరుకుంది.

మరోవైపు సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేగింది. కొందరు న్యాయవాదులు అస్వస్థతకు గురి కావడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు న్యాయవాదులకు కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి.. కోర్టు పరిసరాల్లో అందరూ విధిగా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా దేశంలో కోవిడ్‌ కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇది ప్రాణాంతకం కానప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 24, ఉదయం 8 గంటల వరకు):

  • గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 78,342
  • కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 23–ఏప్రిల్ 24 (8AM-8AM)] : 7,178
  • మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,48,98,893
  • కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 9,011
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,43,01,865
  • కరోనా రికవరీ రేటు : 98.67 శాతం
  • యాక్టివ్ కేసులు : 65,683
  • కొత్తగా నమోదైన మరణాలు : 16
  • మొత్తం మరణాల సంఖ్య : 5,31,345
  • మొత్తం కరోనా వ్యాక్సిన్‌ డోసులు: 220.66 (2,20,66,31,979) కోట్లు పంపిణీ.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =