కరోనా వ్యాక్సిన్ కోసం కో-విన్ పోర్టల్ లో ఎలా నమోదు చేసుకోవాలి?

Co-win Portal, Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, How to Register and Book Appointment for Vaccination, India Covid Vaccination, Mango News, Vaccination in Co-win Portal

దేశంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి మార్చి 1, 2021 నుంచి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో వ్యక్తికీ ఒక్కో డోసుకు ధరను రూ.250గా నిర్ణయించారు. రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కోసం కో-విన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. www.cowin.gov.in పోర్టల్ సోమవారం ఉదయం 9 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు మొబైల్‌ నెంబర్‌/ఆధార్‌ నంబర్ ద్వారా www.cowin.gov.in పోర్టల్ లో తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కోవిన్ పోర్టల్ లో పేరు నమోదు పక్రియ ఈ కింది విధంగా ఉండనుంది.

కో-విన్ పోర్టల్ లో నమోదు ప్రక్రియ:

  • www.cowin.gov.in పోర్టల్ ఓపెన్ చేయ్యాలి.
  • పోర్టల్ లో “Register Yourself” అనే బటన్‌ పై క్లిక్‌ చేసి, అక్కడ మొబైల్‌ నంబరు ఎంటర్ చేస్తే ఓటీపీని జనరేట్ అవుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి ధ్రువీకరించాక “Registration of Vaccination” పేజీ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ ఫోటో ఐడీ (ఆధార్‌, ఓటర్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డులు) ఎంటర్ చేయాలి. అలాగే ఫోటో ఐడీ నెంబర్, అందులో ఉన్న విధంగానే పేరు, వయసు, పుట్టినతేదీ వంటి వివరాలు ఎంటర్‌ చేయాలి.
  • అలాగే కేంద్రప్రభుత్వం ప్రకటించిన విధంగా 20 రకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 45-59 ఏళ్ల వారు వ్యాధిని నిర్ధారణకు సంబంధిత రిజిస్టర్డ్ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ నుంచి ధ్రువీకరణ సర్టిఫికెట్ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
  • వివరాలు ఎంటర్ చేశాక “Register” బటన్ పై క్లిక్ చేయాలి.
  • ఓసారి రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత మీ అకౌంట్‌ వివరాలు కనిపిస్తాయి. “Add More” బటన్ ద్వారా లింక్ చేయబడిన మొబైల్‌ నంబరు మీద గరిష్ఠంగా మరో ముగ్గురు వ్యక్తులను యాడ్‌ చేసుకోవచ్చు.
  • మొబైల్ నంబర్‌తో అనుసంధానించబడిన వ్యక్తులను తర్వాత తొలగించుకునే అవకాశం కూడా ఉంటుంది.
  • కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అపాయింట్‌మెంట్ బుకింగ్ కోసం అకౌంట్ డిటైల్స్ పేజీలో “SCHEDULE APPOINTMENT” బటన్ పై క్లిక్ చేయాలి.
  • అనంతరం “Book Appointment for Vaccination” పేజీ లో సంబంధిత రాష్ట్రం, జిల్లా, పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేస్తే కరోనా వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల వివరాలు వస్తాయి. ఆ జాబితా నుంచి సమీపంలోని ఒక కేంద్రాన్ని ఎంచుకుంటే అందుబాటులో ఉన్న బుకింగ్స్ స్లాట్స్ ను‌ చూపిస్తుంది.
  • అక్కడ సమయం మరియు తేదీని ఎంచుకుని “Book” బటన్‌ను క్లిక్‌ చేస్తే “Appointment Confirmation” పేజీలో వివరాలు కనిపిస్తాయి. ఓసారి చెక్ చేసుకొని “Confirm” బటన్ పై క్లిక్ చేస్తే అపాయింట్‌మెంట్‌ ఖరారు అవుతుంది. మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది.
  • అనంతరం “Appointment Successful” పేజీలో బుకింగ్ వివరాలు కనిపిస్తాయి. ఈ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఒకవేళ అవసరమైతే కరోనా వ్యాక్సిన్ బుకింగ్ అపాయింట్‌మెంట్ మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ అపాయింట్‌మెంట్‌ తీసుకున్న తేదీ కంటే ముందే మార్చుకోవాల్సి ఉంటుంది. “Citizen Registration” మాడ్యూల్ ‌లో లాగిన్‌ అయ్యి అపాయింట్‌మెంట్ ను రీషెడ్యూల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • కరోనా వ్యాక్సిన్ తీసుకునే సమయంలో నమోదు సమయంలో అప్‌లోడ్‌ చేసిన ధ్రువపత్రాల ఒరిజినల్స్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
  • ఒకసారి తోలిడోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక 28 రోజులకు వారికీ అదే కేంద్రంలో ఆటోమేటిక్ గా సెకండ్ డోసు కోసం అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయబడుతుంది. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మరొక నగరానికి మారినట్లయితే, ఆ నగరం సమీపంలోని కరోనా వ్యాక్సిన్ సెంటర్ కు అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయబడుతుంది.
  • రెండో డోసు అనంతరం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 10 =