హైదరాబాద్‌లో నేటి నుంచి మూడు రోజుల జీ-20 సమ్మిట్.. డిజిటల్‌, టెలికాం టెక్నాలజీ వినియోగంపై కీలక వర్క్‌షాప్‌

Hyderabad To Host Three-Day Second Digital Economy Working Group Meetings Of G-20 Summit From Today,Hyderabad To Host Three-Day Meetings Of G-20 Summit,Second Digital Economy Working Group Meetings,Hyderabad Group Meetings Of G-20 Summit From Today,Mango News,Mango News Telugu,Second Meeting Of G20 Digital Economy,G20 Summit 2023 Schedule,G-20 Summit 2023,Hyderabad G-20 Summit 2023,List Of G20 Summits,G20 Summit 2023 India Live,Hyderabad G20 Summit Live

జీ-20 సమావేశాల్లో భాగంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో ‘డిజిటల్‌ ఎకానమీ వర్కింగ్‌ గ్రూప్‌’ (డీఈడబ్ల్యూజీ) సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్‌ శర్మ మరియు టెలికాం శాఖ కార్యదర్శి రాజారామన్‌ పేర్కొన్నారు. కాగా సోమవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్‌, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖల సహాయ మంత్రి నారాయణ స్వామి తదితరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా.. డిజిటల్‌ ఎకానమీని మరింత విస్తృతం చేయడంతో పాటు, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ నైపుణ్యాలను మెరుగుపరచడం తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు వారు వెల్లడించారు. ఇక ఈ విషయాలపై జీ-20 సభ్యదేశాల అభిప్రాయాలను తీసుకుంటామని వారు తెలిపారు.

తొలిరోజున ‘హై-స్పీడ్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ మరియు జీవితాలు, సమాజం మరియు పరిశ్రమలపై దాని ప్రభావాలు’, ‘డిజిటల్ చేరిక: అనుసంధానించబడని వాటిని కనెక్ట్ చేయడం’ మరియు ‘సస్టైనబుల్ గ్రీన్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: సవాళ్లు మరియు అవకాశాలు’ అనే నేపథ్య రంగాలపై మూడు-ప్యానెల్ చర్చలు ఉంటాయని అల్కేష్ కుమార్‌ తెలియజేశారు. ఇక ఈ సందర్భంగా గ్లోబల్ నిపుణులు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో టెలికాం టెక్నాలజీలలో మరియు టెక్నాలజీ-నేడ్ ఇన్క్లూజివ్ డెవలప్‌మెంట్‌లో తమ అనుభవాన్ని పంచుకుంటారని, అలాగే సమావేశాల యొక్క రెండవ మరియు మూడవ రోజున, జీ-20 సభ్య దేశాల మెంబర్లు, ఆహ్వానించబడిన అతిథి దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలు ‘డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’, ‘సైబర్‌సెక్యూరిటీ’ మరియు ‘డిజిటల్ స్కిల్లింగ్’ వంటి ప్రాధాన్యతా ప్రాంతాలలో తీసుకోదగిన చర్యలపై విస్తృతంగా చర్చిస్తారని రాజారామన్‌ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − sixteen =