2,3 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్

Elections were held in those 4 states along with telangana,Elections were held in those 4 states,4 states along with telangana,Mango News,Mango News Telugu,Elections, Election schedule,Elections in 5 states,Telangana,Madhya Pradesh, Rajasthan, Chhattisgarh, Mizoram,Telangana Elections,Elections News Today,Elections Latest News,Elections Latest Updates,Elections Live News

త్వరలోనే కొన్ని రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగబోతోంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అన్ని కసరత్తుల్ని పూర్తి చేసింది. వారం రోజుల లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ మీడియాలు చెబుతున్నదాని ప్రకారం.. అక్టోబర్ 8 నుంచి 10 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ 5 రాష్ట్రాలకు నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం మధ్యనే.. ఎన్నికల కోసం పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం చెబుతున్నట్లు సమాచారం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో.. ఒకే విడతలో, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ 5 రాష్ట్రాలలో జరిగే ఎన్నికల తేదీలు వేర్వేరుగా ఉన్నా కూడా..కౌంటింగ్ మాత్రం ఒకే రోజు జరగనుంది.

మిజోరాం అసెంబ్లీ కాల పరిమితి డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది. ఇక మిగిలిన 4 రాష్ట్రాలకు జనవరి వరకు సమయం ఉంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంసిద్ధతను ఎన్నిలక సంఘం పరిశీలించింది. అన్ని రాష్ట్రాలలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు..తగిన వ్యూహాలను ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం తాజాగా తన పరిశీలకులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్ అమలు, మద్యం, డబ్బు పంపకాలకు చెక్ పెట్టడానికి ఎలాంటి వ్యూహాలు తీసుకోవాలో చర్చించింది.

2024 లోక్‌సభ ఎన్నికల ముందు జరగనున్న తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా కీలకం కాబోతున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా.. మిజోరాంలో బీజేపీ మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ అంటే ఎంఎన్‌ఎఫ్ అధికారంలో ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =