రక్త మార్పిడితో 14 మంది పిల్లలకు హెచ్‌ఐవీ, హెపటైటిస్‌

HIV and Hepatitis in 14 children with blood transfusion,HIV and Hepatitis in 14 children,14 children with blood transfusion,HIV and Hepatitis with blood transfusion,Mango News,Mango News Telugu,Donation of blood at risk, blood Donation ,HIV, Hepatitis,children, blood transfusion,HIV and Hepatitis Latest News,Blood Transfusion Latest News,Blood Transfusion Latest Updates

రక్తదానం పదిమందికి ప్రాణం పోస్తుందంటారు. కానీ కొంతమంది దాతలు ఇస్తున్న రక్తం.. వేరొకరికి ప్రాణ సంకటంగా మారుతోంది. తాజాగా దాతలు ఇచ్చిన రక్తంతో.. రక్తమార్పిడి చేయించుకున్న 14 మంది చిన్నారులకు హెపటైటిస్ బి, సి తో పాటు హెచ్‌ఐవీ వంటి ఇన్ఫెక్షన్లు సోకడంతో డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్త మార్పిడి జరిగిన చిన్నారులకు చేసిన  పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.

కాన్పూర్‌లోని గవర్నమెంట్ ఆధ్వర్యంలోని లాలా లజపతిరాయ్ హాస్పిటల్‌లో ఈ సంఘటన జరిగింది. 14 మంది పిల్లలకు ప్రైవేట్, జిల్లా హాస్పిటల్స్‌లో మార్పిడి జరగగా,వారిలో కొందరికి లోకల్ ఆసుపత్రిలో  వారికి అత్యవసరంగా రక్త మార్పిడి జరిగింది.  రక్తమార్పిడి అవసరమయ్యే తలసేమియా పరిస్థితిని ఎదుర్కొంటున్న పిల్లలు.. ఇప్పుడు దాని కంటే కూడా ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని డాక్టర్ల తీరును తప్పుబడుతూ జాతీయ మీడియా తెలిపింది.

అయితే ఈ  సంఘటనపై డాక్టర్లు ..ఇందులో తమ తప్పేమీ లేదంటున్నారు. సాధారణంగా రక్తదానం చేసిన రక్తాన్ని మళ్లీ ఇతర  పరీక్షల కోసం పంపుతామని.. కానీ అక్కడ పరీక్షలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ఈ ఘటన జరగొచ్చని ఆసుపత్రి అధికారులు తెలిపారు.  సంక్రమణ మూలాన్ని తాము మామూలుగా గుర్తించడం చాలా కష్టమని వారు తెలిపారు.

అయితే రక్తంలో వ్యాధి నిర్ధారణ కాకముందే.. విండో పీరియడ్ సమయంలో చిన్నపిల్లలకు రక్తమార్పిడి జరిగిందని ఓ నోడల్ అధికారి తెలిపారు. ఎందుకంటే పిల్లలు అప్పటికే తీవ్రమైన తలసేమియా సమస్యతో పోరాడుతున్నారని, ఇప్పుడు చివరి దశలో ఉన్నారని చెప్పారు. అయినా కూడా రక్తమార్పిడి సమయంలో వైద్యులు పిల్లలకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించి ఉండాల్సిందన్నారు. 180 మంది తలసేమియా బాధితుల్లో.. 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న 14 మంది చిన్నారులకు ఇప్పుడు హెపటైటిస్ బీ, సీ, హెచ్ఐవీ  ఇన్ఫెక్షన్లు సోకాయని అన్నారు. ఈ చిన్నారలంతా కాన్పూర్ సిటీ, దేహత్, ఫరూఖాబాద్,  కన్నౌజ్, ఔరయ్య, ఎటావా, సహా  వివిధ ప్రాంతాలకు చెందిన వారని పేర్కొన్నారు.

ఏది ఏమయినా రక్త మార్పిడి ద్వారా ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకడం.. ఆందోళన కలిగించే అంశమని, రక్తమార్పిడి వల్ల  జరిగే  నష్టాలను చూపుతుందని అన్నారు. తాము ఈ హెపటైటిస్ సోకిన చిన్నారులను  గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి, హెచ్‌ఐవి రోగులను కాన్పూర్‌లోని రిఫరల్ సెంటర్‌కు రెఫర్ చేశామని అన్నారు. కేవలం తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసమే ఇక్కడ రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఇలా  ఈ రక్తమార్పిడి చేయంచుకున్న 180 మంది రోగులలో  6 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల 14 మంది పిల్లలు ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడినట్లు అయింది. ఇన్ఫెక్షన్ సోకిన పిల్లల్లో ఏడుగురు హెపటైటిస్ బి, ఐదుగురికి హెపటైటిస్ సి,ఇద్దరికి హెచ్‌ఐవి పాజిటివ్‌గా తేలిందని  చెప్పారు.

కాన్పూర్ సిటీ, దేహత్, ఫరూఖాబాద్, కన్నౌజ్‌,  ఔరైయా, ఇటావాతో సహా  వివిధ ప్రాంతాల నుండి పిల్లలు వస్తారు.  ఇప్పటికే తీవ్రమైన సమస్యతో పోరాడుతున్న వీరికి విండో పీరియడ్‌లో రక్తమార్పిడి జరిగింది. అయితే ఎవరైనా రక్త దానం చేసినప్పుడు.. అది వేరొకరికి ఉపయోగించడానికి సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించడానికి ఆ రక్తాన్ని పరీక్షిస్తారు. అయితే  పరీక్షల ద్వారా వైరస్ గుర్తించలేకపోయినా.. ఎవరైనా సోకిన తర్వాత బయట పడేందుకు కొంత సమయం పడుతుంది.  దీనినే విండో పీరియడ్ అంటారు. ఏది ఏమయినా రక్తమార్పిడి సమయంలో వైద్యులు.. ఆ చిన్నారులకు హెపటైటిస్ బి టీకాలు వేసి ఉండాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 6 =