టోక్యో పారాలింపిక్స్-2020 కు వెళ్లే భారత్ అథ్లెట్లతో ప్రధాని మోదీ సమావేశం

2020 Paralympic Games, Mango News, Paralympic Games, Paralympics, PM Modi interacts with the Indian contingent for Paralympics, PM Modi interacts with the Indian para-athlete contingent, pm narendra modi, PM Narendra Modi Interacts with India’s Contingent, PM Narendra Modi Interacts with India’s Contingent for Tokyo 2020 Paralympic Games, Tokyo 2020 Paralympic Games, Tokyo Paralympic, Tokyo Paralympic 2020

టోక్యో పారాలింపిక్స్-2020 క్రీడలు ఆగస్టు 24, 2021 నుంచి సెప్టెంబర్ 5, 2021 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి ఈ పారాలింపిక్స్ లో పాల్గొనే అథ్లెట్లతో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, ఆగష్టు 17 ఉదయం 11 గంటలకు పారాలింపిక్స్ లో పాల్గొనే భారత బృందంతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. వీరంతా అత్యుత్తమ నైపుణ్యం మరియు పట్టుదల చూపిన గొప్ప ఆటగాళ్లని, ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించాలని క్రీడాభిమానులను ప్రధాని మోదీ కోరారు. ఈ కార్యక్రమంలో అథ్లెట్లతో పాటుగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ కూడా పాల్గొన్నారు. టోక్యోలో జరిగే పారాలింపిక్స్‌ లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి 9 క్రీడా విభాగాలకు చెందిన మొత్తం 54 మంది అథ్లెట్ల బృందం వెళ్లనుంది. పారాలింపిక్ క్రీడల్లో ఇప్పటివరకు భారత్ తరపున పాల్గొన్న బృందాల్లో ఇదే అతిపెద్ద బృందమని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 9 =