కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 113

Karnataka Assembly Election Results Counting Begins at 36 Centres Across The State 144 Sec Imposed in Bengaluru,Karnataka Assembly Election,Assembly Election Results Counting Begins,The State 144 Sec Imposed in Bengaluru,Mango News,Mango News Telugu,Karnataka Assembly polls,Karnataka Elections 2023 Live,Karnataka Assembly Election Results To Be Out Today,Karnataka gears up for counting of votes,Karnataka Assembly Elections Results Latest News,Karnataka Assembly Elections Results Latest Updates,Karnataka Assembly Elections Results 2023

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం ఉదయం 8 గంలకు రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో మొదలైంది. దీనికోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు బెంగళూరులో సెక్షన్ 144 విధించారు. కాగా ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగనున్నట్లు, ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని చాలా సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో.. గెలుపు ఎవరిదనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. అయితే, గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్‌, జనతాదళ్‌ (సెక్యులర్‌) నేతలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన సర్వేలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ‘హంగ్‌’ వస్తే ఏం చేయాలన్న దానిపైనా కీలక చర్చలు జరుపుతున్నారు. మరోవైపు, ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోతే.. చక్రం తిప్పేందుకు జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి గౌడ కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాట అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 113. దీంతో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది.. సర్వత్రా ఉత్కంఠగా ఉంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్..

  • కర్ణాటకలో ముగిసిన కౌంటింగ్.. మొత్తం 136 స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం.
  • బీజేపీ 65, జేడీఎస్ 19 స్థానాలకు పరిమితం, మరో 4 స్థానాల్లో గెలిచిన ఇతరులు.
  • రేపు కర్ణాటక సీఎల్పీ సమావేశం.. సీఎంను ఎన్నుకోనున్న సభ్యులు.
  • ఎగ్జిట్ పోల్స్ అంచనాకు మించి కాంగ్రెస్ భారీ విజయం.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబరాలు.
  • 70 స్థానాల్లోపే పరిమితమైన బీజేపీ, ప్రభావం చూపలేకపోయిన జేడీఎస్.
  • బీజేపీ మంత్రులు బీసీ పాటిల్, గోవింద కరజోల, డాక్టర్ కే సుధాకర్, ఎంటీబీ నాగరాజు, బీ శ్రీరాములు, నారాయణ గౌడ, మురుగేశ్ నిరానీ ఓటమి.
  • స్పష్టమైన ఆధిక్యం దిశగా కాంగ్రెస్ పార్టీ.. 12 గంటల సమయానికి 118 స్థానాల్లో ముందంజ.
  • పొత్తులు, కూటములతో పనిలేకుండా సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం.
  • ఘనవిజయం సాధించిన ముఖ్యనేతలు బసవరాజ్ బొమ్మై (ప్రస్తుత సీఎం, బీజేపీ), సిద్దరామయ్య (కాంగ్రెస్), డీకే శివకుమార్ (కాంగ్రెస్), కుమారస్వామి (జేడీఎస్).
  • మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప కుమారుడు విజయేంద్ర విజయం.
  • కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బంధువు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు బంగారప్ప శివమొగ్గలో ఘనవిజయం.
  • 11:30 గంటల సమయానికి ఫలితాలు ఇలా.. కాంగ్రెస్ – 118, బీజేపీ – 73, జేడీఎస్ – 25, ఇతరులు – 8 స్థానాల్లో ఆధిక్యం.
  • కాంగ్రెస్ ముందంజ.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల సందడి.
  • క్షణ క్షణానికి మారుతున్న ఆధిక్యతలు.. హోరా హోరీగా ప్రధాన పార్టీల పోరు.
  • హైదరాబాద్‌కు కర్ణాటక రాజకీయం.. మొదలైన క్యాంపు రాజకీయాలు.
  • గెలిచిన అభ్యర్థులను స్టార్ హోటళ్లకు తరలించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు.
  • కేపీసీసీ అధ్యక్షు డీకే శివకుమార్ మరియు మాజీ సీఎం సిద్దరామయ్య ముందంజ.
  • సీఎం బసవరాజ్ సహా దాదాపు 10మంది మంత్రుల వెనుకంజ.
  • జేడీఎస్ అధినేత కుమారస్వామి ముందంజ, ఆయన కుమారుడు నిఖిల్ గౌడ వెనుకంజ.
  • కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి ముందంజ, ఆయన సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు వెనుకంజ.
  • ఉదయం 10 గంటల సమయానికి ఫలితాలు ఇలా.. కాంగ్రెస్ – 111, బీజేపీ – 78, జేడీఎస్ – 30, ఇతరులు – 5 స్థానాల్లో ఆధిక్యం.
  • పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ముందంజ.
  • ఉదయం 9:10 గంటల సమయానికి కాంగ్రెస్ – 104, బీజేపీ – 79, జేడీఎస్ – 19, ఇతరులు – 11 స్థానాల్లో ఆధిక్యం.
  • కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ సిమ్లా లోని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 2 =