బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత

Actor Irrfan Khan, bollywood, Bollywood Actor Irrfan Khan, Bollywood actor Irrfan Khan dead, Bollywood Actor Irrfan Khan Passed Away, bollywood breaking news, Famous Bollywood Actor Irrfan Khan Dies at 53, Irrfan Khan, Irrfan Khan dies, Irrfan Khan Dies at 53, Irrfan Khan dies in Mumbai, Irrfan Khan is no more

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అరుదైన కాన్సర్ తో బాధపడ్డారు. పెద్ద‌పేగు సంబంధిత వ్యాధితో ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఇర్ఫాన్ ఖాన్ తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. మరోవైపు ఇర్ఫాన్ ఖాన్ త‌ల్లి సైదా బేగం సైతం రాజస్థాన్ లోని జయంపురంలో గత శ‌నివారం నాడు మృతి చెందారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేక వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే త‌ల్లిని క‌డ‌సారి చూసుకున్నారు.

ఇర్ఫాన్ ఖాన్ అకాల మరణంతో బాలీవుడ్ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. తనదైన శైలి నటనతో ఇర్ఫాన్ ఖాన్ చిత్ర పరిశ్రమలో కీర్తిప్రతిష్టలు సంపాదించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డుతో పాటుగా తన నటనకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కాలు అందుకున్నారు. హాలీవుడ్ తో పాటుగా పలు భాషాచిత్రాల్లో నటించారు. తెలుగులో సైనికుడు సినిమాలో విలన్ పాత్రలో నటించారు. అరుదైన క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేసి ఈ మ‌ధ్యే ఆయన కోలుకున్న విషయం తెలిసిందే. ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 4 =