పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో భారత్ బోణీ, తొలి మ్యాచ్‌లో 2-0తో స్పెయిన్‌పై ఘనవిజయం

Men's Hockey World Cup 2023 India Beats Spain with 2-0 in Opening Match, India Beats Spain with 2-0 in Opening Match, Men's Hockey World Cup 2023, 2023 Men's Hockey World Cup, Men's Hockey World Cup, India Beats Spain in Opening Match, India Beats Spain, Team India, Mango News, Mango News Telugu

పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో భారత్ బోణీ చేసింది. తన తొలి మ్యాచ్‌లో 2-0తో స్పెయిన్‌ను ఓడించింది. శుక్రవారం రాత్రి ఇక్కడి బిర్సా ముండా స్టేడియంలో జరిగిన గ్రూప్‌-డి మ్యాచ్‌లో భాగంగా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన స్పెయిన్‌పై విజయం సాధించింది. ఇక ఈ గెలుపుతో జట్టుకు మూడు పాయింట్లు లభించగా, గ్రూప్ డిలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. తద్వారా భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది. తొలి గోల్ చేసి జట్టుకు శుభారంభం ఇచ్చిన వైస్‌-కెప్టెన్‌ అమిత్‌ రోహిదాస్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. కాగా భారత్‌ సోమవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. ఆట 12వ నిమిషంలో డిఫెండ‌ర్ అమిత్‌ రోహిదాస్‌ పెనాల్టీ కార్నర్‌తో భారత్ ఖాతా తెరిచింది.

అనంతరం 26వ నిమిషంలో హార్దిక్‌ సింగ్‌ రెండో గోల్‌ చేయడంతో భారత్ ఆధిక్యం 2-0కు పెరిగింది. దీంతో తొలి అర్ధభాగంలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. అనంతరం సెకండాఫ్‌లో స్పెయిన్ ఆట‌గాళ్లు స్కోరును స‌మం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. కాగా శుక్రవారం ప్రపంచ కప్‌ మొదటి రోజు జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో.. గ్రూప్‌-ఏ లో అర్జెంటీనా 1-0తో సౌతాఫ్రికాపై గెలవగా, మరో మ్యాచ్‌లో హాట్‌ ఫేవరెట్‌ ఆస్ట్రేలియా 8-0తో ఫ్రాన్స్‌పై ఘనవిజయం సాధించింది. ఇక గ్రూప్‌-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 5-0తో వేల్స్‌ను చిత్తు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =