కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. నేడు పలు కీలక బిల్లులపై రాజ్యసభలో చర్చ

Parliament Winter Session 2022 Rajya Sabha To Discuss Key Bill Regarding Gonds and Other Tribes in ST Category Today,Parliament Winter Session,Parliament Winter Session 2022,Telangana Parliament Winter Session,Telangana Parliament Winter Session 2022,Mango News,Mango News Telugu,TS Cabinet Meeting,KCR Cabinet Meeting,Parliament Winter Session Latest News and Updates,TRS Party MP's News and Live Updates,TRS Party,CM KCR,Telangana CM KCR,Telangana Chief Minister,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,winter session of Parliament,winter Parliament session

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నేడు పలు కీలక బిల్లులు రాజ్యసభలో చర్చకు రానున్నాయి. వీటిలో ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన సవరణ బిల్లును రాజ్యసభ చర్చకు చేపట్టనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా రాజ్యసభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో గోండులు మరియు అనుబంధ తెగలను షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో చేర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని ఈ బిల్లు కోరుతోంది. కాగా లోక్‌సభ ఇప్పటికే బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును మార్చి 28, 2022న లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఏప్రిల్‌లో ఆమోదించబడింది.

ఈ బిల్లును ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగలు ఆర్డర్ 1967 మరియు షెడ్యూల్డ్ కులాలు ఆర్డర్ 1950 చట్టాలను సవరించడం కోసం కేంద్రం రూపొందించింది. ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలైన చందౌలీ, ఖుషీనగర్, సంత్ కబీర్ నగర్, మరియు సంత్ రవిదాస్ నగర్‌లలో గోండు సమాజాన్ని షెడ్యూల్డ్ కులంగా మినహాయించే షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వును బిల్లు సవరిస్తుంది. ఈ నాలుగు జిల్లాల్లో గోండు సమాజాన్ని షెడ్యూల్డ్ తెగగా గుర్తించేందుకు ఎస్టీ ఆర్డర్‌ను సవరిస్తుంది. ఇక ఇటీవల జరిగిన మెయిన్‌పురి ఉప ఎన్నికలో భారీ విజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పార్లమెంటులో ప్రమాణం చేశారు.

మరోవైపు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రతిపక్ష నాయకుడు మరియు భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా బకాయిలు చెల్లించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ కేరళ రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ పరిహారం వివరాలను కోరుతూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ఆర్థిక మంత్రితో సమావేశమయ్యారు. ఇక డిసెంబర్ 7న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొత్తం 17 పనిదినాలు పాటు జరుగనున్నాయి. నోటిఫై చేసిన షెడ్యూళ్ల ప్రకారం సెషన్‌లో మొత్తం 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 8 =