కరోనాపై పోరాటంలో 150 పైగా దేశాలకు ఔషదాలు, ఇతర సామగ్రి అందించాం – పీఎం మోదీ

75th Anniversary of United Nations, ECOSOC Meeting, ECOSOC Meeting on Occasion of 75th Anniversary of United Nations, PM Modi, PM Modi Address in ECOSOC Meeting, pm narendra modi, Prime Minister Narendra Modi, United Nations Economic and Social Council

ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా ఎకోసాక్ (ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్) సమావేశాన్ని ఉద్దేశించి జూలై 17, శుక్రవారం నాడు ఆన్‌లైన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. “రెండో ప్ర‌పంచ యుద్ధం ముగియ‌గానే ఐక్యరాజ్య‌స‌మితి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన 50 వ్య‌వ‌స్థాపక స‌భ్య దేశాల్లో భార‌త్ ఒక‌టి. అప్ప‌టికి, ఇప్ప‌టికి ఎంతో మార్పు చోటు చేసుకుంది. ఈ రోజున ప్ర‌పంచంలోని 193 స‌భ్య‌దేశాల‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి ఒక్క తాటిపై న‌డిపిస్తోంది. స‌మితి స‌భ్య‌త్వం పొంద‌డంతో పాటు దానిపై అంచ‌నాలు కూడా ఎంత‌గానో పెరిగిపోయాయని” పీఎం చెప్పారు.

“కరోనా నియంత్రణకు అన్ని దేశాలతో కలిసి పోరాడుతున్నాం. కరోనాపై ఉమ్మడి పోరాటంలో భాగంగా 150 పైగా దేశాలకు వైద్యం, ఇతర సహాయం అందించాం. పొరుగు దేశాలతో కలిసి సార్క్ కోవిడ్ ఎమర్జెన్సీ నిధిని కూడా ఏర్పాటు చేశాం. కోవిడ్-19 మ‌హ‌మ్మారి అన్ని దేశాలకు వైప‌రీత్యాల‌ను త‌ట్టుకోగల శ‌క్తికి ఒక ప‌రీక్ష‌గా నిలిచింది. భార‌త‌దేశంలో ప్ర‌భుత్వ, స‌మాజ చ‌ర్య‌ల‌ను సంఘ‌టితం చేయ‌డం ద్వారా కోవిడ్ పై పోరాటాన్ని ప్ర‌జా ఉద్య‌మంగా మార్చ‌గ‌లిగాం. ఈ సమయంలో నిరుపేద కుటుంబాల‌కు ప్ర‌యోజ‌నాలు అందించ‌డానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. 300 బిలియన్ డాల‌ర్ల‌కు పైబ‌డిన విలువ గల ప్యాకేజిని ప్ర‌క‌టించాం. ఈ ప్యాకేజితో ఆర్థిక వ్య‌వ‌స్థ తిరిగి ప‌ట్టాల మీదకు వచ్చేలా చేస్తున్నామని” పీఎం మోదీ చెప్పారు.

“సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేది మా సిద్ధాంతం. గత ఐదేళ్ల కాలంలో దేశంలో 1.10 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించాం. దాని వల్ల గ్రామీణ పారిశుధ్యం 38 శాతం నుంచి 100 శాతానికి పెరిగింది. భారీ ఎత్తున చేపట్టిన చైతన్య కార్యక్రమాల కారణంగా మహిళా సాధికారత కూడా సాధిస్తున్నాం. జీవనోపాధి కార్యక్రమం కింద నిర్వహిస్తున్న స్వయంసహాయక బృందాల్లో సుమారు 7 కోట్ల మంది గ్రామీణ మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. 2022 నాటికీ దేశంలో అందరికీ సొంత ఇల్లు కలిగివుండేలా ప్రణాళికలు రూపొందించాం. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం అనేది 50 కోట్ల మంది భాగస్వామ్యంతో కూడిన ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం. గ్రామీణ స్థాయిలో ఆరోగ్య వ్యవస్థ విస్తృతి కావడం వలెనే ప్రస్తుత కోవిడ్ పై పోరాటంలో ప్రపంచంలోనే అత్యుత్తమ రికవరీ రేటు కలిగిన దేశంగా భారత్ నిలవడానికి దోహదపడింది. మరోవైపు 2025 నాటికి దేశం నుంచి టిబిని కూడా పూర్తిగా నిర్మూలించే లక్ష్యంలో సరైన బాటలో మేం సాగుతున్నామని” పీఎం మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fifteen =