వాటికన్‌ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ ను కలిసిన ప్రధాని మోదీ, భారత్ కు రావాలని ఆహ్వానం

Mango News, PM Modi, PM Modi At Vatican To Meet Pope Francis, PM Modi Invites Pope Francis, PM Modi Invites Pope Francis to Visit India, PM Modi Meets Pope Francis, PM Modi meets Pope Francis at Vatican, PM Modi Meets Pope Francis at Vatican City, PM Modi Meets Pope Francis at Vatican City Invites him to Visit India, PM Modi Meets Pope Francis For The First Time, PM Narendra Modi meets Pope Francis, Pope Francis

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు ప్రధాని మోదీ వాటికన్‌ సిటీలో క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్‌ ను కలిశారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని మరియు పోప్‌ల మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే. ఈ సమావేశంలో ప్రధానితో పాటుగా కేంద్ర విదేశాంగమంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఉన్నారు. ఈ సందర్భంగా ఇరువురూ కోవిడ్-19 మహమ్మారి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై దాని పర్యవసానాలపై చర్చించినట్టు తెలిపారు.

అలాగే క్లైమేట్ చేంజ్ వల్ల ఎదురవుతున్న సవాల్‌పైనా చర్చించారు. క్లైమేట్ చేంజ్ ఎదుర్కోవడంలో భారత్ తీసుకున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల గురించి, 100 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీలో భారత్ సాధించిన విజయాల గురించి ప్రధాని పోప్‌కు వివరించారు. ఈ మహమ్మారి సమయంలో అవసరమైన దేశాలకు భారత్ చేస్తున్న సహాయాన్ని పోప్ ప్రశంసించారు. మరోవైపు పోప్ ఫ్రాన్సిస్‌ కు భారతదేశాన్ని సందర్శించవలసిందిగా ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అందించారు. ప్రధాని ఆహ్వానాన్ని పోప్ ఫ్రాన్సిస్‌ ఆనందంతో అంగీకరించినట్టుగా పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 13 =