రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు-2021 ప్రదానోత్సవం

President Droupadi Murmu Presents National Florence Nightingale Awards-2021 to the Nursing Professionals,President Droupadi Murmu , National Florence Nightingale Awards-2021, Nursing Professionals, Mango News,Mango News Telugu,Nightingale Awards, Nightingale Awards 2022, Droupadi Murmu Presents National Florence ,Droupadi Murmu Latest News And Updates, Droupadi Murmu Nightingale Awards-2021, Nightingale Awards News

రాష్ట్రపతి భవన్‌లో సోమవారం నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు-2021 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2021 సంవత్సరానికి నర్సింగ్ నిపుణులకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 51 మంది ఏఎన్ఎంలు, ఎల్హెఛ్వీలు, నర్సులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నర్స్ మిరియాల ఝాన్సీ రాణి కూడా ఉన్నారు.

నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను కేంద్రప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా నర్సులు మరియు నర్సింగ్ నిపుణులు సమాజానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఇచ్చేలా 1973లో ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేస్తూ, “నర్సులకు వారి ఆదర్శప్రాయమైన పని మరియు నిస్వార్థ సేవకు సంబంధించి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ 2021 అందించడం ఆనందంగా ఉంది. కోవిడ్ మహమ్మారి మన నర్సుల యొక్క బలీయమైన స్ఫూర్తిని ప్రపంచానికి చూపించింది. ఓవర్‌టైమ్ పని చేయడం, కుటుంబాలకు దూరంగా ఉండటం మరియు చాలా డిమాండ్ ఉన్న పరిస్థితుల్లో సేవ చేశారు. ఈ అవార్డు గ్రహీతలు దేశంలోని యువ నర్సులు మరియు మిడ్ వైవ్స్/మంత్రసానులను తోటి పౌరుల అభ్యున్నతి కోసం నిబద్ధతతో మరియు కరుణతో పనిచేయడానికి ప్రేరేపిస్తారు. మొత్తం నర్సింగ్ సమాజానికి నా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 3 =